వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫీ కరో: యజమానికి వలసకూలీ భావోద్వేగ లేఖ, నేను దొంగను కాను అని.. కానీ...?

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉన్న చోట పని ఉండదు. తినడానికి తిండి కూడా లేకపోవడంతో.. తిరిగి సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అలా వెళుతోన్న వలసకూలీలకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నడిచి వెళ్తుంటే.. మరికొందరు సైకిల్‌ మీద వెళ్తున్నారు. మరికొందరు ట్రక్కుల మీద వెళ్తూ.. వెళ్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శనివారం ఉదయం యూపీలో జరిగిన ప్రమాదంలో కూలీలు చనిపోయారు. అయితే రాజస్థాన్‌లో ఓ వలసకూలీ సైకిల్ దొంగతనం చేశాడు. అవును తాను ఎందుకు చోరీ చేస్తున్నానో లేఖ కూడా రాశాడు.

కరోనా లాక్‌డౌన్ 4.o: భారీ సడలింపులు, ఇక రాష్ట్రాలకే ఆ అధికారంకరోనా లాక్‌డౌన్ 4.o: భారీ సడలింపులు, ఇక రాష్ట్రాలకే ఆ అధికారం

250 కి.మీ పయనం

250 కి.మీ పయనం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన మహమ్మద్ ఇక్బాల్.. పొట్ట కూటి కోసం రాజస్థాన్‌లో ఉంటున్నాడు. భారత్‌పూర్‌ జిల్లా రారలో ఉంటూ.. జీవించేవాడు. అయితే లాక్ డౌన్ వల్ల.. తిరిగి సొంత ఊరు వెళ్లాలనుకొన్నాడు. అయితే అతనికి ఓ అంగవైకల్యం ఉన్న చిన్నారి కూడా ఉన్నారు. 250 కిలోమీటర్లు ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. తాను చేసేదీ కూలీ పని అయిన.. తొలిసారి దొంగతనం చేసేందుకు సాహసించాడు.

 సైకిల్ చోరీ

సైకిల్ చోరీ


తప్పలేనందున.. సాహబ్ సింగ్ సైకిల్ దొంగతనం చేశాడు. అయితే తన సైకిల్ కనిపించడం లేదు అని .. సాహబ్ సింగ్ అనుకొన్నాడు. కానీ ఇల్లు క్లీన్ చేసే సమయంలో వరండాపై ఓ లేఖ కనిపించింది. అది ఇక్బాల్ పేరుతో ఉంది. మీ సైకిల్ తాను దొంగతనం చేశానని అందులో రాసుకొచ్చాడు. తన పరిస్థితిని.. వివరించాడు. తాను దొంగను కాదు అని.. కూలీనని ఇక్బాల్ తెలిపారు. కానీ నిస్సహాయ పరిస్థితిలో మీ సైకిల్ తీసుకున్నానని.. తనను క్షమించాలని కోరారు.

Recommended Video

IAF Flypast : IAF Chopper Showers Flower Petals On Gandhi Hospital In Hyderabad | Oneindia Telugu
కుమారుడి కోసం

కుమారుడి కోసం

తనకు అంగవైకల్యం ఉన్న చిన్నారి ఉన్నాడని.. సైకిల్ మీద వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించలేదు అని అందులో రాశాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదివరకు కూడా కొందరు సైకిల్ దొంగతనం చేసిన దాఖలాలు ఉన్నాయి.

English summary
migrant worker's desperation to return home won over his conscience as he stole a bicycle in Rajasthan's Bharatpur to embark on a 250-kilometre journey back home in Bareilly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X