వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, వారికి ఆహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

Recommended Video

#Watch : A Video Of Migrants Looting Food Packets @ Railway Station

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నర్మదాపురం డివిజన్ రైల్వే స్టేషన్‌కు శ్రామిక్ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వలస కార్మికులు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్ చేసిన ఆహారం, బ్రెడ, వాటర్, తదితర ఆహార పదార్థాలు అధికారులు ఒక ట్రాలీలో తీసుకొచ్చారు.

Migrants Loot Food Cart At Railway Station In Madhya Pradesh

అది చూసిన వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు. రైలు ప్రయాణ సమయంలో ఇవ్వడానికి తెచ్చిన ఆహారమని ఇప్పుడు ఇవ్వమని అధికారులు చెప్పినా వినకుండా.. ఒకరిద్దరు కూలీలు ధైర్యం చేసి ఆ ఆహారం ప్యాకేట్లను తీసుకున్నారు. ఇక మిగిలిన కూలీలు కూడా ట్రాలీపై పడి దొరికిన ఆహారాన్ని లాక్కునిపోయారు.

ఒకరి చేతిలో ఉన్న ఆహారాన్ని మరొకరు తీసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పలువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అధికారులంతా పక్కకు జరిగిపోయారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కూడా లేకపోవడంతో కూలీలంతా తమకందిన ఆహారప్యాకేట్లను పట్టుకెళ్లారని అధికారులు తెలిపారు. కాగా, ఇలాంటి ఘటనలు ఇటీవల పలుచోట్ల చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
A video of migrants looting a food cart at a railway station is doing the rounds in Madhya Pradesh, highlighting once again the plight of homebound migrant labourers, travelling for days without proper food and water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X