వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చేరుకున్న అమెరికా ప్రతినిధులు మైక్ పాంపియో: కీలక ఒప్పందాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌లు సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వాగతం పలికారు. భారత్-అమెరికాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం కోసం వీరి పర్యటన జరుగుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపైనా వీరు చర్చలు జరపనున్నారు.

మైక్ పాంపియో, ఎస్పర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో 2+2 చర్చలు జరుపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సంప్రదింపులు చేపట్టనున్నారు. గత కొద్ది వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల పర్యటన ఆసక్తికరంగా మారింది.

 Mike Pompeo Mark Esper landed in India: To Sign Deal To Access Precision Data From US Military Satellites

అంతేగాక, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైక్ పాంపియో, ఎస్పర్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తోనూ భేటీ కానున్నారు.

భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనతోపాటు దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్ది నెలలుగా అమెరికా చైనా తీరును తప్పుబడుతోంది.

Recommended Video

US Announces Visa Restrictions On Chinese Officials | టిబెట్ యాక్ట్ ప్రయోగం || Oneindia Telugu

ఇక అమెరికన్ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇప్పటికే తెలిపారు. అమెరికా ప్రతినిధుల నేపథ్యంలో చైనా స్పందించింది. అమెరికాకు ఒత్తిడికి భారత్ తలొగ్గదని భావిస్తున్నట్లు పేర్కొంది.

English summary
India will gain access to precision data and topographical images - on a real time basis - from United States military satellites under an agreement to be signed during the ongoing visit of Secretary of State Mike Pompeo and Defence Secretary Mark Esper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X