వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ పరిస్థితులోనైనా భారత్‌కే మద్దతు: చైనాకు మైక్ పాంపియో హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సున్నితమైన ఉపగ్రహం, మ్యాప్ డేటాను పంచుకునేందుకు భారతదేశం- యునైటెడ్ స్టేట్స్(అమెరికా) మంగళవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి, ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో.. చైనాను హెచ్చరించారు.యూఎస్ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌తో కలిసి ఆయన సోమవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.

చైనా ముప్పును ఎదుర్కొనేందుకు..

చైనా ముప్పును ఎదుర్కొనేందుకు..

భారత విదేశాంగ మంత్రి జై శంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కాగా, రక్షణ, స్వేచ్ఛకు చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సి ఉందని పాంపియో వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాంపీయో, ఎస్పర్‌తో 2 + 2 చర్చల మూడవ ఎడిషన్‌ను ఈ ప్రాంతం(భారత్-చైనా)లో తీవ్ర ఉద్రిక్తత సమయంలో నిర్వహించడం గమనార్హం. ఇరు దేశాల సైనికుల మధ్య ఉన్నత స్థాయి సైనిక సాంకేతిక పరిజ్ఞానం, జియోస్పేషియల్ మ్యాప్స్, వర్గీకృత ఉపగ్రహ డేటాను పంచుకునేందుకు వీలు కల్పించే మైలురాయి రక్షణ ఒప్పందం అయిన బేకాపై ఇరు పక్షాలు సంతకం చేశాయి. వారి భద్రతా సంబంధాలను పెంచుకోవటానికి, ఇండో-పసిఫిక్‌లో వ్యూహాత్మక సహకారాన్ని పెంచడానికి ప్రతిజ్ఞ చేశాయి.

భారత్‌తోనే అమెరికా..

భారత్‌తోనే అమెరికా..

సార్వభౌమత్వానికి, స్వేచ్ఛకు బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు అమెరికా మీతోనే ఉంటుందని.. భారత్‌కు అమెరికా చర్చల సందర్భంగా హామీ ఇచ్చింది. చైనా దుందుడుకు వైఖరిని మార్చుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.జైశంకర్, పాంపియో, ఎస్పర్‌తో కలిసి సంయుక్త మీడియా కార్యక్రమంలో ప్రసంగించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇరుపక్షాలు కీలకమైన అంశాలపై సమగ్ర చర్చలు జరిపాయని, అమెరికాతో బేకా ఒప్పందం కుదుర్చుకోవడం "ముఖ్యమైన చర్య" అని అన్నారు.

చైనా నుంచి ఏ పరిస్థితులు ఎదురైనా..

‘అమెరికాతో మా నుంచి సైనిక సహకారం చాలా బాగా ముందుకు సాగుతోంది' అని రాజ్‌నాథ్ అన్నారు, రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు గుర్తించబడ్డాయన్నారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రత కోసం తమ నిబద్ధతను తాము పునరుద్ఘాటించామని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం కోసం జూన్‌ నెలలో గాల్వన్ లోయలో చైనా పీఎల్ఏ దళాల దాడిలో 20 మంది భారత సైనికులు తమ ప్రాణాలను అర్పించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా యుద్ధ స్మారకాన్ని(వార్ మెమోరియల్) సందర్శించారు పాంపియో. చైనా నుంచి ఏ పరిస్థితులు ఎదురైనా తమ మద్దతు భారత్‌కు ఉంటుందని పాంపియో ఈ సందర్భంగా తెలిపారు. కాగా, అమెరికా ప్రతినిధుల భారత్ పర్యటనపై మోడీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం హర్షించదగిన విషయమని అన్నారు.

English summary
India and United States on Tuesday signed a pact to share sensitive satellite and map data as US Secretary of State Mike Pompeo warned of the threat posed by an increasingly assertive China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X