వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కచ్‌లో భూప్రకంపనలు: ప్రజల్లో భయాందోళనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కచ్‌లో శనివారంనాడు స్వల్పంగా భూమి కంపించింది. శనివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ప్రకంపనలు రెక్టార్‌ స్కేలుపై 3.4గా నమోదయ్యాయి.

ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రకంపనల వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించ లేదు. ప్రకంపనలు ఉదయం 6.32 గంటలకు చోటు చేసుకున్నాయి. తీవ్రత చాలా స్వల్పంగా ఉందని భారత మెటీరియోలాజికల్‌ సంస్థ తెలిపింది. ప్రకంపనల కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Mild tremors felt in Gujarat's Kutch; no reports of damage

కచ్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దధాయ్ గ్రామంలోనే కాకుండా రాపార్, గధ్‌శిషా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.

కచ్‌లో గతంలో భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. 2001లో సంభవించిన ఆ భూకంపంలో పదివేల మందిదాకా మరణించారు.

English summary
As many as four mild tremors measuring 1.4 to 3.8 on the Richter Scale were felt in various parts of Kutch district of Gujarat today, Institute of Seismological Research's website said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X