వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పుల్లో ఉగ్రవాది హతం: పఠాన్‌కోట్‌లో కలకలం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సైనికుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.

హతమైన ఉగ్రవాది నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.

పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం

Militant killed in encounter in South Kashmir's Anantnag district

పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఉదయం అనుమానాస్పద సంచి లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు నిర్వీర్య బృందం రైల్వే స్టేషన్‌ను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టింది.

ఇటీవల పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిచేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పోలీసులు, భద్రతా దళాలు భారీ భద్రతా చర్యలు చేపట్టాయి.

English summary
An unidentified militant was today killed in a gunbattle with security forces in South Kashmir's Anantnag district. An encounter broke out at 4 AM in Kokernag district. A militant was killed and his identity is yet to be ascertained, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X