వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్‌లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి కాల్పులు జరుపడంతో మిలిటెంట్ జకీర్ ముసా హతమయ్యాడు.

చుట్టుముట్టిన భద్రతాదళాలు ..

చుట్టుముట్టిన భద్రతాదళాలు ..

దక్షిణ కశ్మీర్ లో ముసా నక్కి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు, భద్రతాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. త్రాల్‌లోని దాడ్ సారలో గల ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ 42 ఆర్ఆర్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. భద్రతాదళాలు చుట్టుముట్టి ముసాను లొంగిపోవాలని కోరాయి. అయితే అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో కాల్పులు జరుపాల్సి వచ్చిందిన ఉన్నతాధికారి తెలిపారు. కాల్పుల్లో ముస చనిపోయాడని పేర్కొన్నారు.

టాప్ కమాండర్

టాప్ కమాండర్

ముసా .. ఇదివరకు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. 2013లో పంజాబ్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదంపై ఆకర్షితుడై హిజ్బుల్ లో చేరాడు. బుర్షాన్ వనీ కన్నా ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలో కమాండర్ గా పనిచేశాడు. తర్వాత తన సొంత సంస్థ అన్సర్ ఘాజ్ వాత్ ఉల్ హింద్ ను స్థాపించారు. ఇది ఆల్ ఖైదాకు గుర్తింపుపొందిన సంస్థ. అలాగే కశ్మీర్ అంశంపై రాజకీయ చర్యలు జరుపుతామన్న హురియత్ నేతలను కశ్మీర్ లాల్ చౌక్ లో ఉరితీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అలర్ట్

అలర్ట్

టాప్ మిలిటెంట్ కమాండర్ హతమవ్వడంతో కశ్మీర్ లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దక్షిణ కశ్మర్ మొత్తం సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అలాగే శుక్రవారం విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

English summary
A top militant commander, Zakir Rashid Bhat, popularly known as Zakir Musa, was reportedly killed on Thursday evening after joint forces, working on a special intelligence, trapped him near his home in the Tral area of south Kashmir. An official confirmation is awaited. A gunfight broke out between militants and security forces at Dadsara village in the Tral area of south Kashmir’s Pulwama district late Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X