వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిల్కాసింగ్ నో: కేజ్రీవాల్ ఎఎపిలోకి భార్య, డాటర్ మోనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్/న్యూఢిల్లీ: ప్రముఖ అథ్లెట్ మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్, యూఎస్‌లో ఉంటున్న కూతురు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ మాత్రం రాజకీయాలకు తాను దూరమని చెబుతున్నారు.

మిల్కా భార్య నిర్మల్ కౌర్ ఒకప్పుడు మాజీ అథ్లెట్. నిర్మల్‌తో పాటు కూతురు మోనా సింగ్ ఎఎపి పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు మిల్కా సింగ్ చెప్పారు. వారు శుక్రవారం సభ్యత్వాన్ని తీసుకున్నారన్నారు. కేజ్రీవాల్ సిద్ధాంతాలు వారికి నచ్చినందువల్లే ఆ పార్టీలో చేరుతున్నారన్నారు.

Milkha Singh

తాను జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ఉన్న సమయాల్లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సిందని, ఇప్పుడు తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని చెప్పారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తే దేశంలో క్రీడారంగం మంచి అభివృద్ధిని సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. సచిన్, పిటి ఉష వంటి క్రీడాకారులను గవర్నర్లుగా, అంబాసిడర్‌లుగా ఎందుకు నియమించరని ప్రశ్నించారు.

కాగా ఎఎపిలో ప్రముఖ విలేకరి, ఐబిఎన్ 7 ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ అశుతోష్ తన పదవికి రాజీనామా చేసి శనివారం చేరారు.

English summary
Legendary athlete Milkha Singh's wife Nirmal Kaur and their US-based daughter have joined the Aam Aadmi Party, but the 'Flying Sikh' himself wants to stay away from politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X