వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓలా, ఉబెర్‌లపైనే యువత మొగ్గు: ఆటో సంక్షోభంపై సీతారామన్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆధునిక యువతి కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని అన్నారు.

గణనీయంగా తగ్గిన ఆటో విక్రయాలు

గణనీయంగా తగ్గిన ఆటో విక్రయాలు

ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.

కారణాలివే..

కారణాలివే..

అశోక్ లేలాండ్ లాంటి ఆటోమొబైల్ సంస్థలు వాహన ఉత్పత్తులను 70శాతానికిపైగా నిలిపేయడం గమనార్హం. ఆటోమొబైల్ రంగంలో నెలకొన్ని సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలోనే కేంద్ర ప్రభుత్వం ఉందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
బీఎస్6(భారత్ 6స్టేజ్) ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనం ఏర్పడిందని అన్నారు.

అన్ని ప్రయత్నాలు..

అన్ని ప్రయత్నాలు..

ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా సమాచారాన్ని సేకరిస్తోందని ఆమె తెలిపారు.

English summary
Finance Minister Nirmala Sitharaman today said millennials' preference for Uber and Ola cabs over committing money to EMIs for new cars had affected the auto sector, which has seen double-digit fall in sales for both two and four-wheeler manufacturers, as well as a 70 per cent drop for truck makers Ashok Leyland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X