వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ విభజనపై భగ్గుమన్న ఒవైసీ..! అక్కడి ప్రజలను గొర్రెల్లా బలి ఇస్తున్నారు..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు స్పస్టంచేసింది ఎంఐఎం. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. తన సొంత ప్రయోజనాల కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహస్యం చేసిందని మండిపడింది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీ ఏంటీ ? ఇప్పుడు చేస్తున్నదేంటీ అని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ సర్కార్ రాజ్యాగ పరిధిలో వ్యవహరించడం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ ముందుకెళ్తున్నారని విమర్శించారు. ఇది సరికాదని .. ఒకటి చెప్పి, మరోటి చేయడం ఏంటని ప్రశ్నించారు. కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారాయన. దీనిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

mim oppose kashmir bifurcation bill

దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందన్నారు అసదుద్దీన్. ఆర్టికల్ 370 రద్దు చేయడం మోడీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదమని విమర్శించారు. ఆర్టికల్ 370 తాత్కాలికమని గతంలో సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తుచేశారు. శ్రీనగర్‌ను వెస్ట్ బ్యాంక్ మాదిరిగా తయారు చేశారని మండిపడ్డారు. కేంద్ర బలగాల నిర్బంధం నుంచి కశ్మీరీలకు విముక్తిం కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఈద్ పండుగ వస్తోంది. గొర్రె పిల్లలకు బదులుగా కశ్మీరీలు బలి కావాలని మోడీ సర్కార్ కోరుకుంటున్నట్టు కనబడుతుందని విమర్శించారు. ఇలా జరగాలని అనుకుంటే వారు త్యాగాలకు వెనకాడరని పేర్కొన్నారు.

English summary
I stand to oppose the bill. Definitely BJP has lived up to their electoral promise in their manifesto, but they have not lived up to their constitutional duties. They have indulged in the breach of a constitutional promise says Asaduddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X