వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి : కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల మహ్మద్ ఆలీ జిన్నా భావజాలం వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం వెలువడిన ఉప ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ అభ్యర్థిని ప్రజలు గెలిపించడం చాల ప్రమాదకరమని అయన అన్నారు. ఆ పార్టీ గెలవడం బీహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం కల్గిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎమ్ఐఎమ్ వందేమాతరాన్ని వ్యతిరేకించే పార్టీ అని దీని వల్ల దేశంలో సామాజిక ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఆపార్టీని గెలిపించడం వల్ల బీహార్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.

అయితే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను స్థానిక జేడీయూ మంత్రి శ్యామ్ రజాక్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నిజంగా కేంద్రమంత్రికి బీహార్ ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని ఆయన సవాల్ విసిరారు.

MIM Winning in Elections spreads Jinnah ideology: Union minister

కాగా ఇటివల జరిగిన మహారాష్ట్ర, హార్యాణ రాష్ట్ర ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ విజయం సాధించింది. తన సమీప బీజేపీ అభ్యర్థి అయిన స్వీటీ సింగ్‌ పై 10వేల ఓట్ల మెజారీటితో ఎమ్ఐఎమ్ అభ్యర్థి గెలుపోందాడు. దీంతో బీహార్‌లో మొదటిసారిగా మజ్లీస్ పార్టీ తన స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే అంతకుముందు జరిగిన 2015 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేసి భారీ ఓట్లను కూడ సాధించింది.

English summary
MIM Winning in Elections spreads Jinnah ideology said Union minister Giriraj sing. and it will very denger for bihar public he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X