• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్‌ది అర్థం లేని వాగుడు-టూల్‌ కిట్‌కి ఇదే సాక్ష్యం-కేంద్రమంత్రుల కౌంటర్ ఎటాక్

|

కరోనా విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ విమర్శించగా... రాహుల్ గాంధీ అర్థం లేని వాగుడు వాగుతున్నాడని బీజేపీ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నిర్లక్ష్య వైఖరికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న రాహుల్ తాజా విమర్శలపై కేంద్రమంత్రులు వరుస కౌంటర్స్ ఇస్తున్నారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో స్పందిస్తూ...'బాధ్యతగల ఈ దేశ పౌరులు విలువైన ఇంటర్నెట్ సదుపాయాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఉపయోగించుకుంటూ ఈ దేశ ఆర్థిక చక్రాలను నడిపిస్తున్నారు. రాహుల్ ఒక్కడే అర్థం పర్థం లేని మూర్ఖపు వాగుడుతో విలువైన ఇంటర్నెట్ సదుపాయాన్ని వ్యర్థం చేస్తున్నాడు.' అని విరుచుకుపడ్డారు.

Mindless Blabbering union minister dharmendra pradhan counter attack on rahul gandhi

మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్...'ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలను గమనిస్తే కేంద్రం ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కాంగ్రెస్ టూల్‌కిట్‌ రూపొందించిందన్న విషయం ధ్రువీకరణ అవుతోంది.' అన్నారు. ఇప్పటివరకూ దేశంలో 20 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామని... వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు.ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 2016 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

'ప్రధానిపై రాహుల్ ఉపయోగిస్తున్న భాష,ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు... ఇవన్నీ చూస్తుంటే ఆ టూల్‌కిట్ రూపొందించింది ఆయనే అని అర్థం అవుతోంది. దీనికి ఇక వేరే ఆధారాలేమీ అక్కర్లేదు.' అని ప్రకాశ్ జవదేవకర్ పేర్కొన్నారు.

అంతకుముందు,రాహుల్ గాంధీ మాట్లాడుతూ... 'దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ ఇంతలా విజృంభించడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనే దీనికి పూర్తి బాధ్యుడు. కరోనా వ్యాప్తిని ప్రధాని సరిగా అంచనా వేయలేకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్లే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కరోనా విషయంలో ప్రభుత్వం వ్యవహార శైలి ఇకనైనా మారాలి. ఇప్పటికైనా కరోనా విషయంలో వాస్తవాలు వెల్లడించాలి.' అని పేర్కొన్నారు.

టూల్ ‌కిట్ విషయానికి వస్తే... కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ఒక ప్రణాళిక రూపొందించిందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ గుర్తుతో సామాజిక మాధ్యమాల్లో దీన్ని సర్క్యులేట్ చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. కుంభమేళాను సూపర్ స్ప్రెడర్‌గా పేర్కొనడం,కొత్త రకం మ్యుటెంట్‌ను ఇండియన్ స్ట్రెయిన్ అని పేర్కొనడం వంటి చర్యలు టూల్‌ కిట్‌లో భాగమేనని అంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలా టూల్ కిట్ డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

  #TogetherWithLakshadweep : Lakshadweep కి Rahul Gandhi అండ | Save Lakshadweep || Oneindia Telugu

  English summary
  Rahul Gandhi's swipes today at Prime Minister Narendra Modi over the second wave of Covid and the vaccination slowdown provoked a swift and acrid fightback from the government with at least two Union Ministers hitting back at the Congress leader.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X