వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మినీ స్కర్స్ట్‌లు బత్కల్‌ను రెచ్చగొట్టాయి: పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mini skirts at Jama Masjid provoked Bhatkal: cops
న్యూఢిల్లీ: పొట్టి గౌన్లు ధరించిన విదేశీ వనితలు ఢిల్లీలోని జామా మసీదులోకి ప్రవేశిస్తుండడం వల్లనే ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని అనుచరులు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు చెప్పారు. జామా మసీదు వద్ద 2010 సెప్టెంబర్‌లో వారు ఉగ్రవాద దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

యాసిన్ భత్కల్, అతని అనుచరుడు అసదుల్లా అక్తర్‌లపై పోలీసులు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పొట్టి దుస్తులు ధరించిన మహిళలు మసీదులోకి ప్రవేశించడం ఇస్లామ్‌కు విరుద్ధమని వారు భావించారని, దాంతో మసీదు మూడో గేటు వద్ద వారు దాడికి దిగారని పోలీసులు ఆ చార్జిషీట్‌లో తెలిపారు.

విదేశీయులు మూడో గేటు వద్ద ఎక్కువగా కనిపిస్తుండడంతో అది దాడికి తగిన స్థలమని అనుకుని రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. 2010 సెప్టెంబర్ 19వ తేదీన భత్కల్, అక్తర్ జామా మసీదు మూడో గేటు వద్ద దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో ఇద్దరు తైవానీయులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

ఇద్దరు బైక్‌పై వచ్చి జమామసీదు మూడో గేటు వద్ద యాత్రికులపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన తెచ్చిన కారులో అమర్చిన బాంబు పేలి చిన్నపాటి పేలుడు సంభవించింది.

English summary
Foreigners wearing mini skirts and entering Jama Masjid in New Delhi prompted Indian Mujahideen (IM) co-founder Yasin Bhatkal and his aides to commit terror strike at the historic mosque in September 2010, the Delhi Police has told a court here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X