వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులు ఇవే

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహానికి రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఐటీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ జారీ చేసిన తాఖీదుకు ఈనెల 25వ తేది (శుక్రవారం)లోపల సమాధానం ఇవ్వవలసి ఉంది. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నోటీసులకు పూర్తి సమాచారం ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి సిద్దం అయ్యారని ఆయన వర్గీయులు అంటున్నారు.

Mining baron Galijanardhan Reddy, Incom Tax officials

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహానికి రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఐటీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. గత సోమవారం ఐటీ శాఖ అధికారులు బళ్లారీలోని గాలి నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసి కీలక పత్రాలు పరిశీలించారు.

Mining baron Galijanardhan Reddy, Incom Tax officials

తరువాత గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని ప్రశ్పలతో ఓ తాఖీదు జారీ చేసి ఈనెల 25వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఐటీ శాఖ, సీబీఐ అధికారులకు ఇచ్చిన సమాచారాన్ని ఇప్పుడు మళ్లీ పరిశీలిస్తున్నారు.

Mining baron Galijanardhan Reddy, Incom Tax officials

గాలికి ఆదాయ పన్నుశాఖ అధికారులు జారీ చేసిన నోటీసులు ఇవే !

1.పెళ్లికి మొత్తం ఎంత ఖర్చుఅయ్యింది ? పెళ్లికి ముందు ఖర్చు ఎంత ? తర్వాత ఖర్చు ఎంత ?
2. కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ?
3. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఖర్చు చేశారు ?
4. పెళ్లికి మొత్తం ఎంత డబ్బలు ఖర్చు చేశారు ?
5. ఆ సోమ్ము ఎక్కడి నుంచి సమకూర్చారు ?
6. ఆ సోమ్ము సమకూర్చిన వారెవరు ? వారి వివరాలు ఇవ్వండి.
7. వివాహానికి ఎంత మంది వచ్చారు ? వారికి చేసిన ఏర్పాట్లు ఏంటీ ?
8. వినోదం, వీడియో, వీవీఐపీ, వీఐపీల భద్రతకు ఎంత ఖర్చు చేశారు ?
9. ఎన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్ లకు మీరు పనులు అప్పగించారు ? ఆ సంస్థలు ఎక్కడున్నాయి ? వాటి వివరాలు ఏంటీ ?
10. పెళ్లికి ఖరీదైన ఆహ్వాన పత్రికలు ఎన్ని ముద్రించారు ? వాటిని ముద్రించిన సంస్థల వివరాలు ఏంటీ ?
11. పెళ్లికి బ్రహ్మాండమైన భోజనాలు సమకూర్చారు, ఆ ఖర్చుల పట్టి ఎంత ?
12. పెళ్లికి ఎంత మంది పురోహితులు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ? వారికి ఇచ్చిన సంభావనల వివరాలు ఏంటి ?
13. పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన కానుకలేంటి ?
14. పెళ్లికి నగదు రూపంలో ఎంత ఖర్చు చేశారు ? నగదు రూపంలో నిధులు సేకరించినట్లయితే ఆ నగదు అందించిన సంస్థలు, వ్యక్తుల పేర్లు, వివరాలు ఏంటీ?
15. డెబిట్, క్రిడిట్ కార్డుల్లో ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారు ? వాటి వివరాలు ఏంటి ?
16. ఆస్తులు విక్రయించారా ? లేదా కుదవ పెట్టారా ? ఎప్పుడు వాటిని ఎవరికి విక్రయించారు ? ఎక్కడ కుదవ పెట్టారు ?

తదితర ప్రశ్నలతో గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు ఓ తాఖీదు జారీ చేశారు. ఈ ప్రశ్నలకు తాము ఇచ్చిన గడువులోపు పూర్తి సమాచారం, వివాహానికి సంబంధించిన అన్నివ్యవహారాల బిల్లులు మొత్తం తమకు సమర్పించాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Income Tax officials have given mining baron Gali Janardhana Reddy till November 25 to explain expenditure on his daughter's lavish wedding. The team that raided his offices in Ballari on Monday has served Reddy with a notice seeking details of expenditure incurred during Bramhani's wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X