
Controversial: రాజ్యంగం పనికిరాదని నోరుపారేసుకున్న మంత్రి, దెబ్బకు పదవి పోయింది, మాటా !
కొచ్చి/కేరళ: కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే దుబాయ్ నుంచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేసిన వారితో సీఎం పినరయి విజయన్ కు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్నా సురేష్ సైతం కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
Actress: మామ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ నటి, ముఖం పచ్చడి, రజనీ, సూర్యతో !
ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు వెలుతున్న సీఎం పినరయి విజయన్ కు ఆయన ప్రభుత్వంలోని మంత్రి చేసిన పనికి హడలిపోయారు. రాజ్యంగం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడిన కేరళ మంత్రి సాజి చేరియన్ ఆయన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యంగం పట్లు కేరళ మంత్రి సాజి చేరియన్ చేసిన వ్యాఖ్యలపై కేరళలోని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

కేరళలోని అలపుజలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో కేరళ మంత్రి సాజి చేరియన్ మాట్లాడారు. భారత రాజ్యంగం ప్రజలను లూటీ చెయ్యడానికి పనికి వస్తుందని, మరిదేనికి పనికిరాదని అన్నారు. భారత రాజ్యంగం అనీల్ అంబాని, ఆదాని లాంటి పెద్దలను ఇంకా ధనవంతులను చెయ్యడానికి పనికి వస్తోందని మంత్రి సాజి చేరియన్ ఆరోపించారు.
భారతదేశంలో ఇప్పటికే బ్రిటీష్ ల రాజ్యంగం అమలులో ఉందని సాజి చేరియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యంగం పేదవాడికి, కార్మికులకు ఈ రాజ్యంగం వలన ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి సాజి చేరియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సాజి చేరియన్ వ్యాఖ్యలతో కేరళలోని ప్రిపక్షాలు మండిపడ్డాయి.
ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎక్కువ కావడంతో సాజి చేరియన్ సీఎం పినరయి విజయన్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన సాజి చేరియన్ తరువాత మీడియాతో మాట్లాడుతూ తనకకు భారత రాజ్యంగం పట్ల ఎంతో గౌరవం ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.