• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియో ఎక్కడ షూట్ చేశారో తెలుసా?: డ్రోన్‌‌తో

|

బెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం.. కలకలం రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని, కటకటాల వెనక్కి నెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ సహా పలువురు సీనియర్ నేతలు అర్ధరాత్రి వరకూ ధర్నాలు చేశారు. ఆందోళనలను నిర్వహించారు. ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదంటూ జార్కిహోళి వివరణ ఇచ్చినప్పటికీ.. వివాదం చల్లారట్లేదు.

డ్రోన్‌తో డ్యామ్ చిత్రీకరణ కోసం..

డ్రోన్‌తో డ్యామ్ చిత్రీకరణ కోసం..

కర్ణాటక పశ్చిమ కనుమల మధ్య నిర్మించిన రిజర్వాయర్లను డ్రోన్‌తో చిత్రీకరించడానికి అవసరమైన అనుమతి కోసం సెక్స్ టేప్ బాధితురాలు రమేష్ జార్కిహోళిని కలిసినట్లు చెబుతున్నారు. రమేష్ జార్కిహోళి జల వనరులశాఖ మంత్రి కావడం వల్ల ఆయన ఆదేశిస్తే.. అనుమతులు త్వరగా లభిస్తాయనే ఉద్దేశంతో బాధితురాలు ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. ఇదివరకే బాధితురాలికి.. పరిచయం ఉండటం వల్ల ఆమె నేరుగా మంత్రిని కలిశారు. కర్ణాటక పవర్ ట్రాన్స్‌కోలో ఉద్యోగం కోసం ఆమె గతంలో కొన్నిసార్లు మంత్రిని కలిశారంటూ తెలుస్తోంది.

ఏకంగా కర్ణాటక భవన్‌లో మకాం..

ఏకంగా కర్ణాటక భవన్‌లో మకాం..

ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన బాధితురాలు బెంగళూరులో పీజీలో నివసిస్తూ, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె అదే ప్రాంతానికి చెందిన మంత్రి రమేష్ జార్కిహోళిని కలిసినట్లు సమాచారం. ఇదివరకే పరిచయం ఉండటం, డ్రోన్ల సహాయంతో కొన్ని రిజర్వాయర్లను చిత్రీకరించడానికి అనుమతులను కోరడం వంటి కారణాలను అడ్డుగా పెట్టుకుని మంత్రి ఆమెను లోబరచుకున్నట్లు భావిస్తున్నారు. తన కోరికను తీర్చుకోవడానికి ఆయన బాధితురాలిని ఢిల్లికి తీసకెళ్లారని, అక్కడి కర్ణాటక భవన్‌లో సెక్స్‌లో పాల్గొన్నారని అనుమానిస్తున్నారు.

కాస్సేపట్లో కర్ణాటక మంత్రివర్గ భేటీ..

కాస్సేపట్లో కర్ణాటక మంత్రివర్గ భేటీ..

కాస్సేపట్లో కర్ణాటక మంత్రివర్గం సమావేశం కానుంది. ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. అసెంబ్లీ సమావేశాలు సహా కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించడానికి, తీర్మానాలను ఆమోదించడానికి కర్ణాటక మంత్రివర్గం భేటీ కానుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందరి కళ్లూ రమేష్ జార్కిహోళిపైనే నిలిచాయి. ఈ సమావేశానికి ఆయన హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠత రేపుతోంది. ఆయన గైర్హాజరవడమంటూ జరిగితే.. ఇక వేటు తప్పకపోవచ్చనే సంకేతాలను ఇచ్చినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. హాజరైతే.. ఆయనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మున్ముందు ఎలాంటి చర్యలను తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది.

వేటు కోసం పట్టు..

వేటు కోసం పట్టు..

రమేష్ జార్కిహోళిని మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్)) ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన వారిలో రమేష్ జార్కిహోళి ఒకరు. ఇదివరకు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి గెలుపొందారు. ఆపరేషన్ లోటస్‌ సమయంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు తప్పుకోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. రమేష జార్కిహోళిపై అప్పటి పగను తీర్చుకోవడానికి.. దీన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ నేతలు పకడ్బందీగా వ్యూహాన్ని రూపొందిస్తోన్నారని అంటున్నారు.

English summary
Minister Ramesh Jarkiholi sex tape video tape shoot at Karnataka Bhavan at Delhi. Karnataka Minister Ramesh Jarkiholi caught in ‘sex for favours’ scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X