వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రామ మందిరం ఉంది, పునర్నిర్మాణం జరుగుతుంది'

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అయోధ్యలో రామమందిరం ఉండేదని, ఉంది అని, మరింత పెద్దగా దానిని పునర్ నిర్మాణమూ జరుగుతుందని కేంద్రమంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ గురువారం నాడు చెప్పారు. రాజ్యాంగం పట్ల నిబద్ధత అంశంపై లోకసభలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ఆయన రామమందిరం అంశాన్ని లేవనెత్తారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణాన్ని రద్దు చేయాలని కోరారు.

రాజ్యాంగ నిబంధనలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. ఇందుకు ఆయన షాబానో కేసును ఉదహరించారు. అదే సమయంలో అయోధ్యలో రామ మందిరం అంశాన్ని ప్రస్తావించారు.

Minister Thawar Chand pushes for Ram temple

పర్సనల్ లా బోర్డులు సమగ్రతకు అవరోధం

రాజ్యాంగం పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పర్సనల్ లా బోర్డుల పైన వ్యాఖ్యానించారు. పలు మతాలకు చెందిన ఉన్నత సంస్థలతో దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందన్నారు. గడిచిన 65 ఏళ్ల కాలంలో ఇది చాలాసార్లు రుజువైందన్నారు.

మత రాజ్యస్థాపన భావనను రాజ్యాంగం నిర్ద్వందంగా తిరస్కరిస్తుందన్నారు. మతం ఆధారిత విభజనను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ సైతం తిరస్కరించారని గుర్తు చేశారు. ఒక్కో మతం ప్రత్యేకంగా రూపొందించుకున్న చట్టాల వల్ల రాజ్యాంగం అమలుకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు.

English summary
Union Minister Thawar Chand Gehlot on Thursday pushed for the construction of a Ram temple in Ayodhya, repeal of Article 370, which gives special status to Jammu and Kashmir, and implementation of a Uniform Civil Code in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X