వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల మధ్య బికినీల బిగ్ ఫైట్

|
Google Oneindia TeluguNews

గోవా: అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు బికినీల విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరు అసెంబ్లీ వేదికగా ఒకరి మీద ఒకరు తిట్లపురాణం అందుకున్నారు. ఒకరు బికినీలు వేసుకుంటే ఏమిటి అన్నారు. ఇంకోకరు అది మన సంసృతి కాదని గుర్తు చేశారు.

గోవా టూరిజం శాఖ మంత్రి దిలీప్ పరులేకర్, పిడబ్ల్యు శాఖ మంత్రి సుదీన్ దావలికర్ ల మధ్య ఈ బికినీ వార్ జరిగింది. ఈ ఇద్దరు మంత్రులు విమర్శలు చేసుకోవడానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. గోవా బీచ్ లలో బికినీలు వేసుకోవడానికి టూరిజం శాఖ మంత్రి దిలీప్ అనుమతి ఇచ్చారు.

అందుకు పిడబ్లూ శాఖ మంత్రి సుదీన్ దావలికర్ వ్యతిరేకించారు. బికినీలు వేసుకోవడం భారతదేశ సంసృతికి వ్యతిరేకమన్నారు. ఇదే సందర్బంలో టూరిజం శాఖ మంత్రి దిలీప్ జోక్యం చేసుకున్నారు. టూరిజం శాఖ మంత్రిగా ఉన్న తాను బికినీలను నిషేధించడం సరికాదని అన్నారు.

 Ministers caught in bikini war in Goa

బీచ్ లు, స్విమ్మింగ్ పూల్స్ లో బీకినీలు వేసుకుంటున్నారని, అంతే కాని మాల్స్ , సూపర్ మార్కెట్ లు, దేవాలయాలలో వేసుకుని తిరగడం లేదని మండిపడ్డారు. టూ పీస్ బికినీలను వెంటనే నిషేధించాలని మంత్రి సుదీన్ దావలికర్ డిమాండ్ చేశారు.

బీచ్ టూరిజానికి గోవా ప్రసిద్ధి చెందిందని, ఇక్కడికి యూరప్ దేశాలకు చెందిన వారు చాల మంది పర్యాటకులు వస్తుంటారని, బికినీలు నిషేధించడం సరికాదని టూరిజం శాఖ మంత్రి దిలీప్ అన్నారు. అయితే చివరికి ఇద్దరు మంత్రుల మద్య వాగ్వివాదం జరిగింది. కొందరు మంత్రులు టూ పీస్ బికినీలను గోవాలో నిషేధించాలని డిమాండ్ చేశారు.

English summary
Parulekar was speaking about tourism-related issues in the ongoing monsoon session of the Goa legislative assembly. "If they (foreign tourists) come out of the beaches wearing bikinis, then I am against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X