వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేయలేదని బాలికపై గ్యాంగ్‌రేప్, ఆమె హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తితో పాటు అతని సోదరులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను చంపేశారు. జార్ఖండ్‌లోని రాంచీ పంచాయతీ ఎన్నికల్లో ఆ బాలిక కుటుంబ సభ్యులు తన భార్యకు ఓటు వేయలేదనే కక్షతో ఆ వ్యక్తి ఆ దారుణానికి ఒడిగట్టారు.

హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం - బాలిక జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. బహిర్భూమికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు లిట్టిపరా పోలీసు స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు.

Minor gangraped, killed as her family did not vote for accused's wife

మర్నాడు బాలిక శవం సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించింది. శుక్రవారంనాడు పోలీసులు నలుగురిని అరెస్టు చేసారు. ప్రేమ్‌లాల హన్సదా, అతని సోదురులు శామ్యూల్ హన్సదా, కత్తి హన్సదా, శిశు హన్సదాల పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తన భార్యకు ఓటు వేయలేదనే కక్షతో తన కూతురిని హత్య చేశారని మృతురాలి తండ్రి ఆరోపించాడు. ప్రేమ్‌లాల్ భార్య సర్పంచ్ పదవికి పోటీ చేసింది. మృతురాలి కుటుంబ సభ్యులే తన భార్య ఓటమికి కారణమని ప్రేమ్‌లాల్ కక్ష పెంచుకున్నాడు.

దాంతో బాలికను అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమె శవాన్ని బ్లేవాన్ అటవీ ప్రాంతంలో దాచి పెట్టారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
In a shocking incident, a man and his brothers in Ranchi, Jharkhand, allegedly gangraped and murdered a 13-year-old girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X