వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనర్ బాలికపై అత్యాచారం .. స్కూల్ ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

|
Google Oneindia TeluguNews

ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఒక పాఠశాల ప్రిన్సిపల్ కు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. పాట్నాలోని ఒక పాఠశాల ప్రిన్సిపల్, 11 సంవత్సరాల వయసున్న ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని పాఠశాలలో ప్రిన్సిపాల్ కు మరణ దండన విధించటంతో పాటు, అదే స్కూల్ లో పనిచేస్తున్న సాహ ఉపాధ్యాయుడైన మరో నిందితుడికి అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించి ₹ 50,000 జరిమానాను కోర్టు విధించింది.

 మధ్యప్రదేశ్ లో మానవ మృగాలు : ఇండోర్ లో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్, బేతుల్ లో మైనర్ బాలికపై రేప్ మధ్యప్రదేశ్ లో మానవ మృగాలు : ఇండోర్ లో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్, బేతుల్ లో మైనర్ బాలికపై రేప్

మైనర్ బాలికపై రేప్ , గర్భవతిని చెయ్యటంతో ప్రిన్సిపాల్ కు మరణశిక్ష

మైనర్ బాలికపై రేప్ , గర్భవతిని చెయ్యటంతో ప్రిన్సిపాల్ కు మరణశిక్ష

పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో దీనిపై ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి అవధేష్ కుమార్ విచారణ జరిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధన చేయాల్సిన వ్యక్తి అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేయడంతో ఆగ్రహించిన ధర్మాసనం అరవింద్ కుమార్ కు మరణ శిక్ష విధించడంతో పాటుగా లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

2018లో దారుణం ... స్కూల్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం , బాలిక గర్భవతి

2018లో దారుణం ... స్కూల్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం , బాలిక గర్భవతి


2018 సంవత్సరంలో అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. స్కూల్ ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ చేతిలో దారుణంగా అత్యాచారానికి గురైన బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్ళిన తల్లిదండ్రులు, ఆమె గర్భవతి అని తెలియడంతో షాకయ్యారు. ఆ తర్వాత బాలిక తనపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడినట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. అరవింద్ కుమార్ కు మరో ఉపాధ్యాయుడు అభిషేక్ కుమార్ సహకరించినట్లుగా పేర్కొంది.

డీఎన్ఏ ఆధారాలతో పాటు బలమైన సాక్ష్యాలను నమోదు చేసిన పోలీసులకు కోర్టు ప్రశంస

డీఎన్ఏ ఆధారాలతో పాటు బలమైన సాక్ష్యాలను నమోదు చేసిన పోలీసులకు కోర్టు ప్రశంస

దీంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద పోక్సో చట్టం కింద మరియు ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు సెక్షన్ల కింద ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు. ఇక తాజాగా ఈ కేసును విచారించిన పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి మరణదండన విధిస్తూ తీర్పును వెలువరించారు. డీఎన్ఏ ఆధారాలతో పాటుగా , ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను, బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించిన పోలీసుల ప్రయత్నాలను కోర్టు ప్రశంసించింది.

తీర్పుపై బాలిక తల్లి సంతృప్తి .. సరస్వతీ పూజకు ముందు శుభదినం అంటూ హర్షం

తీర్పుపై బాలిక తల్లి సంతృప్తి .. సరస్వతీ పూజకు ముందు శుభదినం అంటూ హర్షం


బాధితురాలి తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ కు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తాను నిరంతరం బెదిరింపులతో జీవించానని , కొంతకాలం పాట్నా నుండి దూరంగా కూడా వెళ్లిపోయానని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నేను సంతృప్తిగా ఉన్నాను. ఇది సరస్వతి పూజ రోజుకు ముందే వచ్చింది కాబట్టి ఇది శుభ దినం అంటూ ఆమె పేర్కొన్నారు.
తన పోరాటానికి అర్ధం ఉందన్నారు. చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలే విధించాలన్నారు .

English summary
The principal of a school in Patna has been sentenced to death and a school teacher has been imprisoned for life by a court for the rape of a Class 5 student.Special POCSO judge Awadhesh Kumar, in an order passed on Monday, announced capital punishment for the principal Arvind Kumar besides imposing on him a fine of ₹ one lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X