రెండేళ్లుగా కూతురిపై మారు తండ్రి అత్యాచారం, రైలులో మహిళకు వేధింపు
థానే/ఢిల్లీ: 17 ఏళ్ల బాలిక పైన ఓ మారు తండ్రి రెండేళ్లకు పైగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. థానే పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. 34 ఏళ్ల ఆ నిందితుడు రిక్షా డ్రైవర్‌గా డొంబివాలిలో పని చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, అరెస్టు చేశారు. ఆమె శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నిందితుడు స్థానికంగా థాకూర్ వాడి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. 2012 నుండి డిసెంబర్ 2014 వరకు బాలిక పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి పైన పోలీసులు అత్యాచారం, పోస్కో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు.
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళకు లైంగిక వేధింపు

నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ మహిళను ఇద్దరు లైంగిక వేధింపులకు గురి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రైలు కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సదరు మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను జయేంద్ర సింగ్, నవీన్ కుమార్‌లుగా గుర్తించారు. వారిద్దరు నాగపూర్‌కు చెందినవారు. తమ కూతురును వేధించారని తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధిత మహిళ కాన్పూర్‌కు చెందిన వ్యక్తి.












Click it and Unblock the Notifications