వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్ మిరాకిల్.. మృత్యుంజయుడు నిర్వాన్!

ముంబై డాక్టర్లు అద్భుతం సృష్టించారు. 22 వారాల ప్రెగ్నెన్సీలో పుట్టిన నిర్వాన్‌కు ప్రాణదానం చేశారు. కేవలం 610 గ్రాములతో పుట్టిన ఆ శిశువు ఇప్పుడు మృత్యుంజయుడిగా నిలిచాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై డాక్టర్లు అద్భుతం సృష్టించారు. 22 వారాల ప్రెగ్నెన్సీలో పుట్టిన నిర్వాన్‌కు ప్రాణదానం చేశారు. కేవలం 610 గ్రాములతో పుట్టిన ఆ శిశువు ఇప్పుడు మృత్యుంజయుడిగా నిలిచాడు.

సుమారు 132 రోజుల పాటు ఆ చిన్నారి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడి బరువు 3.72 కిలోలు. ఇంటెన్సివ్ కేర్ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. శాంతాక్రజ్‌లో ఉన్న సూర్యా హాస్పిటల్లో చిన్నారి నిర్వాన్‌కు చికిత్స జరిగింది.

mumbai-nirvaan

నెలలు నిండకముందే పుట్టి.. ప్రాణాలు దక్కించుకున్న ప్రిమెచ్యూర్ బేబీల్లో నిర్వాన్ కేసును మెడికల్ మిరాకిల్‌గా భావిస్తున్నారు. మెదడు, కంటి చూపు, వినికిడి, నరాల సమస్యలతో ఈ ఏడాది మే12న నిర్వాన్ పుట్టాడు.

అతడి తల్లి(35) బాంద్రాకు చెందినామె. అయితే డాక్టర్లు ఆ చిన్నారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రాణాలు దక్కించుకున్న అతి ప్రిమెచ్యూర్ బేబీ నిర్వాన్ అని డాక్టర్లు ఇప్పటికే సర్టిఫికెట్ ఇచ్చేశారు.

ఎన్‌ఐసీయూలో మొత్తం 14 మంది డాక్టర్లు, 50 మంది నర్సులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆరు వారాల పాటు ఆ శిశువు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. ఆ తర్వాత మరో ఆరు వారాల పాటు పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ మెషీన్‌పై ఉన్నాడు. నిర్వాన్ కోసం అతడి తల్లిదండ్రులు సుమారు 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

English summary
Nirvaan, a baby born in the 22nd week of pregnancy weighing just 610 g, won his battle for life. After 132 days in a Neonatal Intensive Care Unit , he now weighs 3.72 kg, and is out of intensive care. His parents will take him home on Sunday. Doctors at Surya Hospital in Santacruz, which treated Nirvaan, said that he is probably India’s most premature baby to have survived. Nirvaan’s mother, a 34-year-old Bandra resident (who has asked not to be named) had what seemed to be a normal pregnancy, but on May 12, she suddenly went into labour. Nirvaan was born with extremely underdeveloped organs. In the NICU, 14 doctors across specialities and over 50 nurses took care of Nirvaan around the clock. He spent six weeks on a ventilator and another six weeks on a Continuous Positive Airway Pressure machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X