వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలబ్రిటీస్ మిరాకిల్: సల్మాన్‌ఖాన్‌కు 3 గంటల్లోనే బెయిల్ ఎలా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కేవలం మూడు గంటల్లోనే బెయిల్ వచ్చింది! సాధారణంగా సెలబ్రిటీలకు త్వరగా బెయిల్ వస్తుంటుంది. ఇది సాధారణ పౌరులకు వింతగానే అనిపిస్తుంది. బుధవారం నాడు సల్మాన్ ఖాన్‌కు గంటల్లో బెయిల్ వచ్చింది. అతనికి బెయిల్ ఇప్పించేందుకు ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే రంగంలోకి దిగారు.

సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడుతుందని భావించిన అతని తరఫు లాయర్లు ముందుగానే అంతా ప్రిపేర్ అయి వెళ్లి ఉంటారని అంటున్నారు. సాధారణంగా కోర్టు శిక్షను విధించిన తర్వాత.. కోర్టు కాపీ వచ్చాక, దానిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత బెయిల్ కోసం పైకోర్టుకు వెళ్తుంటారు.

అయితే, సల్మాన్ తరపు లాయరు హరీష్ సాల్వే బాంబే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి, వాదనలు వినిపించారు. ఆయన తమకు సెషన్స్ కోర్టు కాపీ ఆర్డర్ ఇంకా అందలేదని చెప్పారు. సెషన్స్ కోర్టు తీర్పు అందనందున మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించింది. అంతేకాకుండా, ఆరోగ్యపరమైన కారణాలను కూడా హరీష్ సాల్వే బాంబే కోర్టుకు చెప్పారు.

Miracles happen with celebrities: How Salman Khan managed to get bail in 3 hours

కాగా, సల్మాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు రెండు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో కారు నడిపి ఫుట్ పాత్ పై పడుకున్న ఒకరి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

సల్మాన్ ఖాన్‌కు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం మధ్యాహ్నం కోర్టు తుది తీర్పు వెల్లడించిన వెంటనే.. హీరో తరఫున హరీష్ సాల్వే రంగంలోకి దిగారు. సల్మాన్ ఖాన్‌కు అలా శిక్ష ఖరారైందో లేదో ఆయన తరపు లాయర్లు అంతకంటే స్పీడుగా మధ్యాహ్నం గంటల్లో ముంబై హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసి, తీసుకువచ్చారు.

English summary
Three hours were enough for senior lawyer Harish Salve to manage an interim bail for Salman Khan. This was one rare of the rarest cases when someone got bail from high court within hours after being sentenced by a session court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X