వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.1000కోట్ల స్కాం: మిసా భారతికి సమన్లు, జరిమానా

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది.

రూ. 1000కోట్ల మనీ లాండరింగ్ కేసులో మంగళవారం విచారణ అధికారి ముందు మిసా భారతి హాజరుకావాల్సి ఉంది. అయితే మంగళవారం విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో రూ. 10వేలు జరిమానా విధించింది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Misa Bharti fails to appear before IT department, slapped with fine

వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా, దర్యాప్తు అధికారి తిరస్కరించారు. లాలూ కుమార్తె, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మే నెలలో ఆదాయపుపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు.

వీరి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రాజేష్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు మే 22న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మిసా భారతి, శైలేష్ లకు ఆదాయపుపన్ను శాఖ సమన్లు జారీచేసింది.

English summary
The Income Tax department has issued show cause notice to Lalu Prasad Yadav's daughter and RJD MP Misa Bharti. Misa who was summoned to appear before officials for questioning in a land scam case failed to turn up on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X