వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా, ఉత్తరప్రదేశ్ లో అరాచకం, కాంగ్రెస్ ఆందోళన!

|
Google Oneindia TeluguNews

లక్కో: ఉత్తరప్రదేశ్ లోని గోలా ప్రాంతంలో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ విగ్రహానికి కొందరు అల్లరిమూకలు బుర్కా వేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పండింది. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా వెయ్యడంతో మంగళవారం ఆందోళనలు మొదలైనాయి.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా వేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. జిల్లాధికారుల వైఫల్యం వలనే ఇలా జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి వేసిన బుర్కా తొలగించి నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Miscreants in Uttar Pradesh covered Indira Gandhis statue with Burqa

మంగళవారం వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన స్థానికులు గుర్తించడంతో ఇందిరా గాంధీ విగ్రహానికి బుర్కా వేసిన విషయం వెలుగు చూసింది. వాకింగ్ వెళ్లిన వారు సమాచారం ఇవ్వడంతో వారి స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

శాంతిని భగ్నం చెయ్యడం కోసం కొందరు అల్లరిమూకలు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

English summary
Miscreants in Uttar Pradesh covered Indira Gandhi's statue with Burqa. The incident triggered protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X