వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్షిక స్వేచ్ఛా?.. అబద్ధాలు, అర్థసత్యాలు వద్దు: యూఎస్ ఎన్జీవోపై భారత్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో స్వేచ్ఛ తగ్గిపోతోందని ఓ అమెరికాకు చెందని ఎన్జీవో సంస్థ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛ ఉండే దేశాల జాబితాలో భారత్ స్థాయిని 'స్వేచ్ఛ' స్థాయి నుంచి పాక్షిక స్వేచ్ఛ(స్వాతంత్ర్యం)కు కుమారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నివేదిక ఓ తప్పుల తడక అని స్పష్టం చేసింది. నివేదిక తప్పు అని, తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడింది. ఇలాంటి నివేదికలు ఇవ్వడం సరైనపని కాదని తేల్చి చెప్పింది.

 Misleading, Incorrect, Misplaced: Govt Slams US NGO Report Claiming India is Only Partly Free Now

కేంద్రంలో ఒక్క పార్టీనే పరిపాలన సాగిస్తున్నప్పటికీ.. భారతదేశంలో చాలా రాష్ట్రాలు వేరే ప్రభుత్వ పరిపాలనలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వతంత్ర, నిజయాతీతో కూడిన ఎన్నికల విధానంలో గెలిచి, రాజ్యంగా బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలే. ఇది శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కేంద్రం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

భారతదేశపు స్వతంత్ర హోదా పాక్షిక స్వతంత్రంగా మారిందని ఫ్రీడమ్ హౌస్ వార్షిక నివేదిక ఇటీవల పేర్కొంది. ప్రపంచ రాజకీయ హక్కులు, స్వాతంత్య్రాలపై ఈ నివేదికను రూపొందించారు. నరేంద్ర మోడీ ప్రధానిగా 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచీ భారతదేశంలో పౌర స్వాతంత్య్రాలు క్షీణించాయని ఆ సంస్థ తన డెమొక్రసీ అండర్ సీజ్ పేర్కొంది. ప్రజాస్వామ్యం, అధికారికవాదం మధ్య సంతులనంలో జరిగిన మార్పుల్లో భాగంగా దేశపు స్వతంత్ర హోదా మారిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్రంగా మండిపడింది. అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికింది.

English summary
After a US-government funded NGO said in a report that civil liberties in India had been on a decline since Prime Minister Narendra Modi came into power, the government responded saying the findings were “misleading, incorrect and misplaced”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X