• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

|

చెన్నై/ మదురై: పెళ్లి అయ్యింది, కొడుకు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అయ్యో అని జాలి చూపించి నగదు, నగలు కట్నకానుకలు ఏమీ తీసుకోకుండా వివాహం చేసుకున్న భర్త అతనికి ఉన్నకాడికి భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అయితే 18 నెలల క్రితం మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓ మిస్డ్ కాల్ వారి కాపురంలో చిచ్చురేపింది. మిస్డ్ కాల్ తో పరిచయం అయిన యువకుడితో తాను మిస్ అని మిసెస్ కాదని నమ్మించి ముగ్గులోకి దింపింది. కొంతకాలం రహస్యంగా మిస్డ్ కాల్ ప్రియుడితో ఎంజాయ్ చేసిన మహిళ భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయి ప్రియుడిని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అయితే తనకంటే ముందు ఆ మహిళకు వివాహం అయ్యి భర్త, పిల్లలు ఉన్నారని తెలుసుకున్న యువకుడు ఆమెతో కాపురం చెయ్యడానికి నిరాకరించాడు. పరువు తీసి వేరే యువకుడిని రెండో పెళ్లి చేసుకున్న భార్యను ఆమె భర్త ఛీకొట్టాడు. మొదటి భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు, బంధువులు అందరూ ఆమెను చేరదీయడానికి నిరాకరించడంతో ఆమె రోడ్డున పడి చివరికి క్వారంటైన్ కేంద్రంలో తలదాచుకుంది.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 తల్లిదండ్రులు లేని అనాథ

తల్లిదండ్రులు లేని అనాథ

తమిళనాడులోని నెల్ లై జిల్లాలోని పాళయంకోటై క్రిష్ణాపురం ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళకు ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. ఆమెకు అన్నతమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు ఎవ్వరూ లేరు. సమీప బంధువులు చేరదీసి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజ్ లో డిగ్రీ వరకు చదివించారు. బంధువుల సహకారంతో ఆమె డిగ్రీ పూర్తి చేసింది.

 ఆపద్భాంధవుడితో పెళ్లి

ఆపద్భాంధవుడితో పెళ్లి

నెల్ లై జిల్లాలోని పాళయంకోటై క్రిష్ణాపురం ప్రాంతానికి చెందిన మహిళను సేరన్ మహాదేవి ప్రాంతంలో నివాసం ఉంటున్న కూలి కార్మికుడు 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు లేరని, కనీసం పెళ్లి కూడా చెయ్యలేని స్థితిలో ఉన్న బంధువులను చూసి అయ్యో అంటూ ఆ మహిళను నగదు, నగలు, కట్నం కోసం ఆశపడుకుండా ఆపద్బాంధవుడిలా ఆమెను కూలికార్మికుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు 18 నెలల క్రితం వరకు చాలా సంతోషంగా ఉన్నారు.

 మిస్డ్ కాల్.... హలో అంటూ టచ్ లోకి

మిస్డ్ కాల్.... హలో అంటూ టచ్ లోకి

ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆ మహిళకు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తరువాత మిస్డ్ కాల్ నెంబర్ కు ఆ మహిళ ఫోన్ చేసింది. తాను పొరపాటును మీ నెంబర్ కు ఫోన్ చేశానని, సారీ అంటూ అవతలి వ్యక్తి సమాధానం చెప్పాడు. అంతటితో ఆ రోజు ఫోన్ కాల్ కట్ అయ్యింది. మళ్లీ హలో అంటూ మిస్డ్ కాల్ నెంబర్ నుంచి మరోసారి ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. తరువాత అప్పటి నుంచి ఫోన్ లో ఎంచక్కా మాట్లాడుకుంటున్న ఇద్దరు ఒకరిని ఒకరు చూడకుండానే దగ్గర అయ్యారు.

 నేను మిస్......చాలా బాగుంటాను

నేను మిస్......చాలా బాగుంటాను

ఫోన్ లో పరిచయం అయిన వ్యక్తిని ఓ సారి ఆ మహిళ కలిసింది. తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం ఆ మహిళ మిస్డ్ కాల్ ఫ్రెండ్ దగ్గర దాచిపెట్టింది. ఆ మహిళకు పెళ్లి కాలేదని మోసపోయిన యువకుడు ఆమె ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి యువకుడిని కలవడానికి వెలుతున్న ఆ మహిళ మెడలో మంగళసూత్రం, కాలి మెట్టలు తీసివేసి దాచిపెట్టి అతనితో రాసలీలలు సాగించింది. అప్పటి నుంచి భర్త కళ్లుకప్పిన ఆ మహిళ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది.

 మంచి ఉద్యోగం, ఇంటర్వూకు వెలుతున్నా !

మంచి ఉద్యోగం, ఇంటర్వూకు వెలుతున్నా !

ప్రియురాలు స్వర్గం చూపిస్తూ ఎక్కడలేని సుఖం ఇవ్వడంతో నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని యువకుడు అతని కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పాడు. యువకుడు మొండికి వెయ్యడంతో అతని కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత నెల 20వ తేదీన తనకు మంచి ఉద్యోగం వచ్చిందని నాగర్ కోవిల్ లో ఇంటర్వూ ఉందని భర్తకు చెప్పిన మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త, ఇద్దరు పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడిని రెండో పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ డిసైడ్ అయిపోయింది.

 కొంపముంచిన పెళ్లి ఫోటోలు

కొంపముంచిన పెళ్లి ఫోటోలు

లాక్ డౌన్ లోనే గతనెల జూన్ 24వ తేదీన తెన్ కాళీ సమీపంలోని సుందరపాండియన్ పురానికి ప్రియుడితో కలిసి ఆ మహిళ వెళ్లింది. తరువాత అక్కడికి వెళ్లిన మహిళ ప్రియుడి బంధువుల సమక్షంలో అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. అంతటితో ఆమె సైలెంట్ గా ఉండలేదు. భర్త రెండో పెళ్లి ఫోటోలను ఆమె ఫోన్ లో స్టేటస్ పెట్టింది. అదే సమయంలో ఇంటర్వూ కోసం నాగర్ కోవిల్ కు వెళ్లిన తన భార్య కనపడటం లేదని ఆ మహిళ భర్త సేరన్ మహాదేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. మహిళ రెండో పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి మొదటి భర్తకు తెలియడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ఛీ......నాకొద్దు, నాకు అసలే వద్దు

ఛీ......నాకొద్దు, నాకు అసలే వద్దు

మహిళ మెదటి భర్త, సేరన్ మహాదేవి పోలీసులు మహిళ రెండో భర్త ఇంటికి వెళ్లారు. తరువాత ఆమెకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసుకున్న రెండో భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళ మీద స్థానిక కయత్తార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందు పంచాయితీ జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను తాను పొరపాటున పెళ్లి చేసుకున్నానని, ఆమెతో తాను కాపురం చెయ్యలేనని రెండు పెళ్లి చేసుకున్న యువకుడు తేల్చి చెప్పాడు. తనను, తన పిల్లలను గాలికి వదిలేసి కామంతో రెండో పెళ్లి చేసుకున్న తన భార్యను ఇంట్లోకి రానివ్వనని మొదటి భర్త తెగేసి చెప్పాడు.

 క్వారంటైన్ కేంద్రమే దిక్కు

క్వారంటైన్ కేంద్రమే దిక్కు

మొదటి భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త ఛీకొట్టడంతో ఆ మహిళ రోడ్డున పడింది. ఇంతకాలం ఆమెను పెంచిపోషించిన బంధువులు సైతం ఆమెను దగ్గరకు రానివ్వలేదు. ఎవ్వరూ ఆ మహిళను చేరదియ్యకపోవడంతో ఆమెను సేరన్ మహాదేవి ప్రాంతంలోని కరోనా వైరస్ క్వారంటైన్ కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద మొదటి భర్త, రెండో భర్త ఛీకొట్టడంతో ఎటూకాకుండా పోయిన మహిళను చూసి ఆమె బంధువులు సైతం అయ్యో పాపం అనడం లేదని పోలీసులు అంటున్నారు.

English summary
Missed call lover: Married women cheated young man in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X