వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరేళ్ల చిన్నారి .. నిర్జీవంగా స్నేహితుడి ఇంట్లో ... అతనిపైనే అనుమానం

|
Google Oneindia TeluguNews

లక్నో : ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో అసలే తెలియదు. కానీ ఆ చిన్నారి మాత్రం విగతజీవిగా పడి ఉంది. తన తండ్రి కోలింగ్ ఇంట్లో నిర్జీవంగా కనిపించింది. ఆ చిన్నారి కనిపించకుండా పోయిన కొన్ని గంటల్లోనే ఆచూకీ దొరికింది. కానీ అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది .. ఆమెను తల్లిదండ్రులు బతికించుకోలేకపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధానిలో జరిగిన హృదయ విదారకర ఘటన ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది.

లక్నోలో ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. అతనికి భార్య, ఆరేళ్ల కూతురు ఉంది. అతను పనిచేసే చోట మరో సహోద్యోగి కూడా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ అభం శుభం తెలియని పాప ప్రాణాలమీదికి వచ్చింది. నిన్న సాయంత్రం పాప కనిపించకుండా పోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కొద్దిసేపటికే ఆమె ఆచూకీ లభించింది. పాప తండ్రి కోలిగ్ ఇంట్లో కనిపించింది.

Missing 6 year old girl found with slit throat

కానీ నిర్జీవంగా పడి ఉండటంతో వారు గుండెలు బాదుకున్నారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి గొంతుపై కోసి ఉండటం, అప్పటికే రక్తం పోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలోని ట్రామా సెంటర్‌‌లో చేర్చిన ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

తన కూతురు మృతికి కారణం పాప తండ్రి సహోద్యోగి అని ఆరోపిస్తున్నారు. అతని ఇంట్లోనే నిర్జీవంగా కనిపించినందున కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సహోద్యోగి పాత్రపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

English summary
a six-year-old girl who went missing on Sunday evening was later found with a slit-throat in Lucknow, Uttar Pradesh, from the house of a person working with the victim's father. The girl was admitted to the trauma centre and is said to be in a critical state. Lucknow's Senior Superintendent of Police, Kalanidhi Naithani told reporters that a probe in the case is underway. He also stated that the family has registered a complaint against the individual from whose home the child was found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X