వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VG Siddartha Missing: దొరికిన సిద్ధార్థ భౌతిక కాయం! బ్రిడ్జి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో..

|
Google Oneindia TeluguNews

Recommended Video

దొరికిన సిద్ధార్థ భౌతిక కాయం! || VG Siddhartha’s Was Found From The Netravati River || Oneindia

మంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన ఉదంతం.. విషాదంతమైంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఆయన భౌతిక కాయాన్ని గుర్తించారు. 36 గంటల పాటు అన్వేషణ అనంతరం ఆయన భౌతిక కాయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు సమీపంలోని నేత్రావతి నది ఒడ్డున వీజీ సిద్ధార్థ భౌతిక కాయాన్ని పోలీసులు కనుగొన్నారు.

VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?VG Siddhartha Missing: చివరిసారిగా సిద్ధార్థ కనిపించింది ఎక్కడంటే..?

నేత్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జి దగ్గరి నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హొయిగే బజార్ సమీపంలో ఓ ఐస్ తయారీ కేంద్రం సమీపంలో వీజీ సిద్ధార్థ భౌతిక కాయం కనిపించింది. ఈ భౌతిక కాయం సిద్ధార్థదేనా? కాదా? అనే విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భౌతికకాయం ఒంటిపై ఉన్న ఆనవాళ్లను బట్టి అది సిద్ధార్థదేనని అంటున్నారు. భౌతికకాయంపై చొక్కా లేదు. ప్యాంటు మాత్రమే ఉంది. నోటి నుంచి రక్తం కారుతున్న గుర్తులు ఉన్నాయి.

Missing CCD Founder VG Siddhartha’s Body Recovered

సిద్ధార్థ కోసం బుధవారం రాత్రంతా అన్వేషణ కొనసాగించారు. 300 మంది ఇందులో పాల్గొన్నారు. వందమంది పోలీసులు, మరో వందమంది అగ్నిమాపక దళ సిబ్బంది, 50 గజ ఈతగాళ్లు, 25 మందికి పైగా మత్స్యకారులు సిద్ధార్థ కోసం తెల్లవారు జాము వరకూ గాలించారు. హొయిగె బజార్ సమీపంలో, ఓ ఐస్ తయారీ కేంద్రం వద్ద సిద్ధార్థ భౌతిక కాయాన్ని ఈ తెల్లవారు జామున గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు విఠల్ మాల్యా రోడ్డులోని తన కార్యాలయం నుంచి కేఏ 03 ఎన్ సీ 2592 నంబర్ ఇన్నోవా కారులో సిద్దార్థ తన టీ ఎస్టేట్ కు బయలుదేరారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు చిక్ మగళూరు జిల్లా సకలేశ పురాకు చేరుకుంది. నిజానికి వారి ప్రయాణం చిక్ మగళూరు వైపు సాగాల్సి ఉంది. సకలేశ పురాకు చేరుకున్న తరువాత కారును మంగళూరు వైపునకు వెళ్లాల్సిందిగా సిద్ధార్థ కారు డ్రైవర్ బసవరాజ్ పాటిల్ కు సూచించారు.

మంగళూరు నగర శివార్లకు చేరుకున్న తరువాత కారును కేరళ హైవే మీదికి వెళ్లమని చెప్పారు. సాయంత్రానికి మంగళూరు శివార్లలోని నేత్రావతి బ్రిడ్జిపైకి చేరుకున్నారు. డ్రైవర్ బసవరాజ్ పాటిల్ ను కారులోనే ఉండమని, తాను వచ్చేంత వరకూ వేచి చూడమని సూచించి వెళ్లిన సిద్ధార్థ ఇక తిరిగి రాలేదు. కారులో లభించిన లేఖ ఆధారంగా ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానించారు. ఈ అనుమానాలు నిజమయ్యాయి. ఆయన భౌతిక కాయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Coffee Day founder VG Siddhartha’s body was recovered on Wednesday morning, after he went missing in Mangaluru on Monday. A massive team of 100 firefighters, 100 policemen, 50 divers, 50 fishermen and 30 boats who were involved in the search operations, managed to trace his body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X