మిత్రుడి పనే: కాలేజీ గర్ల్‌పై హోటల్లో రేప్, హత్య
పక్షం రోజుల క్రితం అదృశ్యమైన 17 కాలేజీ అమ్మాయిపై మిత్రుడే అత్యాచారానికి పాల్పడి, అతన్ని హత్య చేసినట్లు తేలింది. ఓ హోటాల్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
చండీఘర్: పక్షం రోజుల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల కాలేజీ అమ్మాయిపై అత్యాచారానికి, హత్యకు గురైంది. మిత్రుడే ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. ఈ సంఘటన హర్యానాలోని గోహానాలో గల ఓ హోటల్లో జరిగింది.
మృతురాలిని సోనిపాట్‌లోని ఖాన్పూర్ కలాన్‌కు చెందిన విక్రమ్ సింగ్ అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సంఘటన గురించి తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) అధికారులు హోటల్ యజమాని భార్య మెహక్‌ను మంగళవారంనాడు అరెస్టు చేశారు. తన భర్త ప్రోద్బలంతో మృతురాలికి దుస్తులు తొడగడానికి సహకరించినట్లు ఆమె అంగీకరించింది.
హోటల్ వర్కర్స్ బిజేందర్ సింగ్, వికాస్ సింగ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాధే రాధే హోటల్లో జరిగిన ఈ సంఘటన జరిగింది. ఆ హోటల్ రిజిస్టర్లో ఎంట్రీ అయిన వివరాలు విక్రమ్ సింగ్ వివరాలతో సరిపోలినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ 12వ తేదీ సాయంత్రం విక్రమ్ హోటల్ గది నుంచి వచ్చి బాధితురాలు స్పృహ తప్పి పడిపోయినట్లు హోటల్ యజమాని రాధే శ్యామ్‌కు చెప్పినట్లు సిట్ అధికారులు తెలిపారు. హోటల్ యజమానికి మృతురాలికి బట్టలు తొడగడానికి తన భార్య సహాయం తీసుకున్నాడు.