వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !

|
Google Oneindia TeluguNews

వారణాసి/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఆ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు తీసుకోవాలంటే వారి కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతాల్లో వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కాటుకు బలి అయిన వారి మృతదేహాలు చూడకుండా ప్లాస్టిక్ కవర్లలో చుట్టేసి ఇస్తున్నారని పలు ప్రాంతాల్లో ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన తరువాత కరోనా వైరస్ వ్యాధి వచ్చిన వ్యక్తి మాయం కావడం, తరువాత అదే వ్యక్తి డ్రైనేజ్ లో శవమై కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది హత్య చేసి కిడ్నీలు లాక్కొని శవాన్ని డ్రైనేజ్ విసిరేసి తరువాత కవర్లలో చుట్టుసి ఇచ్చారని, మాకు చివరి చూపు దక్కకుండా చేసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రిని ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 ప్రధాని మోడీ నియోజక వర్గం

ప్రధాని మోడీ నియోజక వర్గం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్దర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి గత వారం వారణాసిలోని సుందర్ లాల్ బీహెచ్ యూ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరిన తరువాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. బీహెచ్ యూ ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కనపడకుండా పోయాడని ఆసుపత్రి వర్గాలు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి.

 డ్రైనేజ్ లో శవం ప్రత్యక్షం

డ్రైనేజ్ లో శవం ప్రత్యక్షం

వారణాసిలోని సుందర్ లాల్ బీహెచ్ యూ కోవిడ్ 19 కేర్ వార్డులో చికిత్స పొందుతూ మాయం అయిన వ్యక్తి కోసం అతని కుటుంబ సభ్యులు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది గాలించారు. మరుసటి రోజు సోమవారం సాయంత్రం వారణాసిలోని ఓ డ్రైనేజ్ లో ఆసుపత్రి నుంచి మాయం అయిన వ్యక్తి మృతదేహాన్ని వారణాసిలోని ఓ డ్రైనేజ్ లో గుర్తించారు. విషయం తెలుసుకున్న రోగి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

 ఆసుపత్రి ధ్వంసం

ఆసుపత్రి ధ్వంసం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరిన తరువాత కరోనా పాజిటివ్ అని చెప్పారని, తరువాత అతను మాయం అయ్యాడని డ్రామాలు వేశారని, చివరికి అతని కిడ్నీలు లాక్కొని హత్య చేసి మృతదేహాన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ లో విసిరేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బీహెచ్ యూ ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు.

 శాంతిని కాపాడండి

శాంతిని కాపాడండి

విషయం తెలుసుకున్న వారణాసిలోని వివిద పోలీస్ స్టేషన్ ల సిబ్బంది బీహెచ్ యూ ఆసుపత్రి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పడానికి విఫలయత్నం చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు శాంతికపోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు ఆసుపత్రి దగ్గరకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి వారిని శాంతియుతంగా ఉండాలని, మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నచ్చచెప్పారు.

అన్నీ అనుమనాలే ?

అన్నీ అనుమనాలే ?

గతవారం రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు వారణాసిలోని సుందర్ లాల్ బీహెచ్ యూ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఒకరోజు చెప్పారని, అసుపత్రి నుంచి పారిపోయాడని మరో రోజు చెప్పారని, ఈ రోజు డ్రైనేజ్ లో అతను శవమై కనిపించాడని, కిడ్నీల కోసం ఆసుపత్రి సిబ్బంది అతన్ని హత్య చేశారని ఆరోపిస్తూ

మృతుడి కుటుంబ సభ్యులు ధాఫియా లంకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

English summary
Coronavirus: A missing COVID 19 patient's body was found a day after near BHU's sewer in Varanasi, family allges he was killed by hospital for kidney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X