చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటికన్న జైలే మేలు...! స్నేహితులను మిస్సవుతున్నానంటూ దొంగతనాలు...!

|
Google Oneindia TeluguNews

నేరాలు చేసిన ఖైదీలకు జైలు జీవితం గడపడం చాల కష్టంగానే ఉంటుంది. క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతామా, కుటుంభ సభ్యులతో ఎప్పుడు గడుపుదామా అనే ఆలోచనలో ఉంటారు.జైల్లో ఉన్నన్ని రోజులు మానసికంగా కృంగిపోతూ అనారోగ్యం అయ్యోవారు కూడ ఉంటారు. ఈనేపథ్యంలోనే జైళ్లో గడిపిన నరకయాతనను తల్చుకుంటూ తిరిగి నేరాలు చేసేందుకు చాలమంది జంకుతారు. ఇక నేరాలు చేయడమే వృత్తిగా చేసేవాళ్లు కూడ పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతారు. కాని కావాలని మాత్రం పోలీసులకు పట్టుపడి జైలుకు వెళ్లరు.

అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..? అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?

జైలే ఇళ్లు, ఖైదీలే స్నేహితులు...

జైలే ఇళ్లు, ఖైదీలే స్నేహితులు...

కాని తమిళనాడుకు చెందిన 52 సంవత్సరాల ప్రకాశ్ అనే ఓ మధ్యవయస్కుడికి మాత్రం కుటుంభ సభ్యుల కన్నా జైళ్లో గడపడమే చాల ఇష్టం. జైళ్లో ఉన్న ఖైదీలతోనే సహవాసం..దీంతో నేరం చేసి విడుదలైన వారంరోజులకే ఓ దోంగతనం చేసి కావాలని పోలీసులకు పట్టుపడి తిరిగి జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ అనే వ్యక్తి ఓ దోంగతనం కేసులో గత మార్చిలో పుజల్ జైలుకు వెళ్లాడు. అయితే మూడు నెలల అనంతరం జూన్ 29న విడుదల అయ్యాడు.

ఇంట్లో అవమానాలు..

ఇంట్లో అవమానాలు..

ఇక జైలు నుండి విడుదలైన ప్రకాశ్‌ను ఆయన కుటుంభ సభ్యులు తీవ్రంగా అవమానించారు. ఇంట్లో ప్రకాశ్‌కు సరైన గౌరవం ఇవ్వలేని పరిస్థితి. దీంతో ప్రకాశ్‌ బయట ఉండలేక పోయాడు.ఇంట్లోకంటే జైళ్లోనే సరేన సౌకర్యాలు, మాట్లాడేందుకు తోటి ఖైదీలు ఉన్నాయని భావించాడు. జైలులో అయితే సమయానికి ఫుడ్‌తోపాటు అక్కడ ఉండే ఖైదీలతో ఏర్పరుచుకున్న స్నేహబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తిరిగి జైలుకు వెళ్లాలని నిర్ణయించాడు. ఇందుకోసం మరో దొంగతనం చేయాలని భావించాడు.

దొంగతనం చేసి తానే ఒప్పుకుని...

దొంగతనం చేసి తానే ఒప్పుకుని...

అనుకున్నదే తడవుగా ఓ బైకును దొంగతనం చేశాడు. అయితే ఆ బైకును దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న సీసీ కేమేరాల్లో పోలీసులు గుర్తు పడేందుకు వీలుగా పదేపదే తన ముఖాన్ని చూపించాడు. అనంతరం బైకు తీసుకుని తాపిగా వెళ్లాడు. అనంతరం బైకులో
పెట్రోల్ కోస పార్క్ చేసిన మరో బైకులో తీస్తూ... దోంగతనానికి పాల్పడ్డాడు. పెట్రోల్ తీస్తున్న ప్రకాశ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు పట్టుకున్న నేపథ్యంలోనే ప్రకాశ్ తాను పెట్రోల్ మాత్రమే తీయలేదు, బైక్‌ను కూడ దొంగతనం చేశానంటూ పోలీసులకు తానే స్వయంగా చెప్పాడు.

దీంతో ప్రకాశ్ అనుకున్నట్టుగానే పోలీసులు ప్రకాశ్‌పై దోంగతనం కేసు పెట్టి తిరిగి ఫుజల్ జైలుకు తరలించారు. తాను అనుకున్నట్టే పోలీసులు కేసు పెట్టడడంతో సంతోషంగా జైలుకు వెళ్లాడు ప్రకాశ్.

English summary
for 52-year-old Gnanaprakasam of Chennai, jail meant home. A roof over his head, three meals a day on time and friends for company meant everything to Gnanaprakasam who was lodged in Puzhal jail for theft in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X