వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జులై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు... 2కి.మీ దాటి వెళ్లొద్దు.. మహా మిషన్ బిగిన్ ఎగైన్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. దీంతో తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది మహా సర్కార్ . ఇక తాజా పరిస్థితి మహా రాష్ట్ర సర్కార్ కు పెద్ద సంకటంగా మారింది. దీంతో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం #Mission begin again అంటూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Recommended Video

COVID-19 : 15,413 New Cases in 24 hours, Can 'Covid Drug' Favipiravir Help ?
మహా మిషన్ బిగిన్ ఎగైన్.. మరోమారు కఠిన నిర్ణయం

మహా మిషన్ బిగిన్ ఎగైన్.. మరోమారు కఠిన నిర్ణయం


రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టిన మహారాష్ట్ర సర్కార్, ఆయా ప్రాంతాలలో కేసులో తీవ్రతను బట్టి వారు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అత్యవసరం కాని కార్యాకలాపాలను కట్టడి చేయాలని ఇప్పటికే స్పష్టం చేసిన మహారాష్ట్ర సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మహారాష్ట్రలో మాత్రం కరోనా భీకర రూపం దాలుస్తున్న నేపధ్యంలోనే మరోమారు కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది.

 జులై 31వరకు లాక్ డౌన్ ... ఆదేశాలు జారీ

జులై 31వరకు లాక్ డౌన్ ... ఆదేశాలు జారీ

ఈ నేపథ్యంలోనే తిరిగి లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోనే కరోనా అత్యంత ప్రభావం చూపిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనాకోరల్లో చిక్కి విలవిలలాడుతున్న మహారాష్ట్ర కేసుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,64,626 కరోనాకేసులు నమోదు కాగా 7429 మంది ప్రాణాలు కోల్పోయారు.

 ఇంటి నుండి రెండు కి.మీ దాటి వెళ్లొద్దు అని సూచన

ఇంటి నుండి రెండు కి.మీ దాటి వెళ్లొద్దు అని సూచన

లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని భావిస్తున్న మహారాష్ట్ర సర్కార్ మరోమారు లాక్ డౌన్ విధించింది. ఇక అంతే కాదు ముంబై వాసులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధి దాటి బయటకు వెళ్లొద్దు అని ముంబై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దేశ ఆర్థిక రాజధానిలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే రెండు కిలోమీటర్ల దాటి ప్రయాణించేందుకు అనుమతులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు

కేసుల తీవ్రత దృష్ట్యా మహా సర్కార్ కీలక నిర్ణయం

కేసుల తీవ్రత దృష్ట్యా మహా సర్కార్ కీలక నిర్ణయం


దేశంలో ఢిల్లీ తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ముంబైలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయనున్నారు. ప్రజల సామాజిక దూరం పాటించాలని ,మాస్కులు ధరించాలని, అనవసరంగా బయట తిరగవద్దు అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు . కేసుల కట్టడి చెయ్యకుంటే కష్టం అని భావించి సీఎం ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మహారాష్ట్రలో లాక్ డౌన్ నిబంధనలను మరోమారు కఠినంగా అమలు చేయనున్నారు.

English summary
The Maharashtra government has extended the coronavirus lockdown till July 31 amid a steady growth in the COVID-19 numbers in the state. Issuing fresh guidelines for what it called 'Mission Begin Again', the government said that movement for non-essential activities will be restricted within the neighbourhoods in the Mumbai Metropolitan Region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X