వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక గగన్‌యాన్, రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్ కీలక వ్యాఖ్యలు, విక్రమ్ కథ ముగిసినట్లే

|
Google Oneindia TeluguNews

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా దొరకలేదని, చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తెలిపారు. సిగ్నల్స్ దొరకకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ల్యాండర్‌లో ఏం జరిగిందో గుర్తిస్తామన్నారు. చంద్రయాన్ 2లో రోవర్లు మొరాయించినప్పటికీ, ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. అదే సమయంలో మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు మరో ప్రయోగాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు.

రోదసీలోకి భారతీయుడు

రోదసీలోకి భారతీయుడు

గగన్‌యాన్‌‌లో భాగంగా 2012 డిసెంబర్‌లో రోదసీలోకి భారతీయుడిని పంపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు శివన్ తెలిపారు. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే పగటి సమయంలో మాత్రమే ల్యాండర్, రోవర్లు పని చేస్తాయని, ఆ పగటి సమయం శనివారంతో ముగిసిందని చెప్పారు.

గగన్‌యాన్‌పై ప్రభావం ఉండదు

గగన్‌యాన్‌పై ప్రభావం ఉండదు

విక్రమ్ వైఫల్యాల ప్రభావం గగన్‌యాన్ పైన ఉండదని శివన్ చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలి మానవరహిత యాత్రను నిర్వహిస్తామని, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని, అదే ఏడాది డిసెంబర్ నెలలో మన సొంత రాకెట్లో తొలి భారతీయుడిని రోదసీలోకి పంపిస్తామని చెప్పారు. భవిష్యత్తుపై చర్చిస్తున్నామని, గగన్‌యాన్ పైన దృష్టి సారించామన్నారు. శనివారం ఐఐటీ భవనేశ్వర్‌లో నిర్వహించిన ఎనిమమిదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అక్కడ మాట్లాడారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.

సిగ్నల్స్ ఇంకా దొరకలేదు

సిగ్నల్స్ ఇంకా దొరకలేదు

చంద్రయాన్ 2 లాండర్ విక్రమ్ సిగ్నల్స్ ఇంకా దొరకలేదని ఇస్రో చీఫ్ కె శివన్ వెల్లడించారు. త్వరలో సమాచారం వస్తే కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్బిటార్‌లోని 8 పేలోడ్లు బాగానే పని చేస్తున్నాయని చెప్పారు. తీసిన ఫోటోలు బాగున్నాయన్నారు. అవి భవిష్యత్తు పరిశోధనలకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. ఇది చంద్రుడిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తుందని, చంద్రయాన్ 2 ప్రయోగ సమయంలో నిర్వహించిన ప్రణాళిక వల్ల ఆర్బిటర్ జీవితకాలం ఏడాది నుంచి ఏడున్నరేళ్లకు పెరిగిందన్నారు.

 98 శాతం విజయం సాధించాం

98 శాతం విజయం సాధించాం

శాస్త్ర పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన అనే రెండు అంశాల్లో చంద్రయాన్ 2 తొంబై ఎనిమిది శాతం విజయం సాధించిందని శివన్ తెలిపారు. సాంకేతిక ప్రదర్శన విజయాల రేటు దాదాపు వంద శాతం ఉందని తెలిపారు. సాఫ్ట్ ల్యాండింగ్ మినహా ఈ మిషన్‌లో ఉపయోగించిన అన్ని పరికరాలు బాగా పని చేశాయన్నారు. విక్రమ్ ల్యాండగ్ దిగే సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

విక్రమ్ కథ ముగిసినట్లే

విక్రమ్ కథ ముగిసినట్లే

చంద్రయాన్ 2 మిషన్లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 98% సాధించామని శివన్ తెలిపారు. విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పరిశోధనలు, రెండోది సాంకేతికత. సాంకేతికత కోణంలో దాదాపు పూర్తిగా విజయం సాధించామన్నారు. ఇదిలా ఉండగా విక్రమ్ ల్యాండర్ కథ ముగిసినట్లేనని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయట. దాని జీవితకాలం 14 రోజులేనని, శనివారం సాయంత్రంతో ఆ గడువు ముగిసిందంటున్నారు. చంద్రుడిపై రాత్రి ప్రారంభమైతే సూర్యకాంతి పడదని, ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల వరకు పడిపోతాయని, దీంతో ల్యాండర్ ఫ్రీజ్ అవుతుందని చెబుతున్నారు.

English summary
Mission Gaganyaan is our next priority, said ISRO chairman K Sivan on Saturday adding that Chandrayaan 2 has achieved 98 per cent of its objectives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X