వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mission Gaganyaan: అంతరిక్షంలో మన వ్యోమగాములు తినేందుకు.. స్పెషల్ దేశీ వంటకాలు..

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2022లో చేపట్టనున్న మిషన్ గగన్‌యాన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపనున్న సంగతి తెలిసిందే. అక్కడ మనవాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన దేశీ వంటకాల్ని తినబోతున్నారు. మైసూర్‌లో ఉన్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ (డీఎఫ్ఆర్ఎల్) లో వంటకాల్ని రెడీ చేశారు.

సకల రుచులూ..

సకల రుచులూ..

అంతరిక్షలోకి వెళ్లే వ్యోమగాముల కోసం మొత్తం 22 రకాల రుచుల్ని డీఎఫ్ఆర్ఎల్ సిద్దం చేసింది. వాటిలో వెజిటేరియన్ తోపాటు నాన్ వెజ్ పదార్థాలూ ఉన్నాయి. ఫుడ్ ఐట‌మ్స్ లిస్టులో ఇడ్లీ సాంబార్, చికెన్ బిర్యానీ, పాలకూర, పప్పు, మూంగ్ దాల్ కా హల్వా, వెజ్ పలావ్, వెజ్ రోల్స్ తోపాటు ఎగ్ రోల్స్ కూడా ఉన్నాయి. డ్రైఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ ను కూడా లిస్టులో చేర్చారు.

ఎలా తింటారు..

ఎలా తింటారు..

వ్యోమగాములు ఏపూటకాపూట ఆహారాన్ని వేడి చేసుకుని తినేందుకు వీలుగా స్పేస్ షిప్పులో ఫుడ్ హీట‌ర్ల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు. అలాగే వాళ్లు స్పేస్ లో తేలియాడే స్థితిలో ఉంటారు కాబట్టి నీళ్లు, జ్యూస్ లాంటివి తాగడానికి వీలుగా స్పెషల్ కంటెయినర్లనూ తయారుచేశారు. వాట‌ర్‌, జ్యూస్‌ల‌ను తీసుకువెళ్లేందుకు స్పెష‌ల్ ప్యాకెట్ల‌ను త‌యారు చేశారు.

ఆ నలుగురరూ ఎవరు?

ఆ నలుగురరూ ఎవరు?

2022లో మిష‌న్ గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు ఉందన్న ఇస్రో చైర్మన్ శివ‌న్.. ఇప్పటికే ఎంపిక చేసిన నలుగురు వ్యోమ‌గాములకు బెంగళూరులో పలు టెస్టులు నిర్వహించామని చెప్పారు. త్వరలోనే ట్రైనింగ్ కోసం రష్యాకు పంపుతామన్నారు. అయితే ఆ నలుగురు ఎవరనేది మాత్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

English summary
Special food packets and fluid containers have been prepared for astronauts taking part in India's upcoming manned space mission, Gaganyaan. Training for astronauts will soon begin in Russia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X