• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన కేంద్రమంత్రి పియూష్ గోయల్...!

|

ఆటో మోబైల్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో కేంద్రమంత్రులు సంక్షోభానికి గల కారణాలను ప్రజలకు వివరించేందుకు తడబడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఏదో చెబుతామనుకుంటే మరెదో అవుతోంది. ఈనేపథ్యంలోనే ఇద్దరు మంత్రులు అబాసుపాలైన విషయం తెలిసిందే. దీంతో వారు చేసిన తప్పులను ప్రజల ముందుకు ఒప్పకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడీయా సెటైర్లకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దిగివచ్చాడు. తాను చేసిన తప్పును అంగీకరించారు. గురుత్వాకర్షణ శక్తి సిద్దాంతంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పకున్నారు. అయితే ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారని చెప్పిన ఆయన,తప్పులు చేసినంత మాత్రన నేను భయపడేవాడిని కాదంటూ ప్రకటించారు.

గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుక్కోంది ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యలు

గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుక్కోంది ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యలు

గురువారం ఆయన ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో దుమారాన్ని రేపాయి. ఈనేపథ్యంలోనే దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. విపక్షాలకు కౌంటర్ ఇచ్చే సమయంలో ఆయన అబాసుపాలయ్యారు.కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితారామన్‌కు మద్దతుగా నిలిచే సమయంలో ఆయన కూడ ప్రజల్లో ఆభాసు పాలయ్యాడు. ఈనేపథ్యంలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇంట్లో కూర్చొని లెక్కలు వేయకండి అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సంధర్భంలోనే ముందు గణితాన్ని మర్చిపోండి.. గణితాన్ని పట్టుకొని ఉంటే ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కునే వాడు కాదు. కేవలం గణితమే ముఖ్యమైతే ఏ ఆవిష్కరణలు ప్రపంచంలో జరిగి ఉండేవి కాదు. అంటూ వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు...

ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు...

అయితే నిజానికి గురత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది ‘న్యూటన్'. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యానించి నెటిజన్లకు దొరికిపోయాడు. దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. ఆయన మాటలకు నెటిన్లు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు.గురుత్వాకర్షణ శక్తి సిద్దాంతంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పకున్నారు. అయితే ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారని చెప్పిన ఆయన,తప్పులు చేసినంత మాత్రన నేను భయపడేవాడిని కాదంటూ ప్రకటించారు.

క్యాబ్‌ల వల్లే కార్ల కొనుగోలు తగ్గిందన్న నిర్మలా సితారామన్

క్యాబ్‌ల వల్లే కార్ల కొనుగోలు తగ్గిందన్న నిర్మలా సితారామన్

దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ‌‌్‌లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని .. యువత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కారు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొవడం కన్నా .. క్యాబ్ బుక్ చేసుకోవడమే మేలని యువత భావిస్తున్నారని ఆమే తెలిపారు. అయితే కేంద్రమంత్రి చేసిన కామెంట్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక సోషల్ మీడీయాలో అయితే నెటిజన్లు వింత వింత కామెట్లు పెట్టారు.మరోవైపు ఆమే చేసిన వ్యాఖ్యలను మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం తప్పుబట్టారు. కార్ల విక్రయాలు పడిపోవడాన్ని ఆమే తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Piyush Goyal, the union minister who was targeted on social media for incorrectly attributing Newton’s discovery of gravity to Albert Einstein on Friday acknowledged that he had erred but got back at his detractors who had taken potshots at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more