వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిజోరాం రాజధానిలో 7 రోజుల లాక్ డౌన్... రేపటి నుంచే అమల్లోకి...

|
Google Oneindia TeluguNews

మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. మంగళవారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున 4.30గంటల నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున 4.30గంటల వరకు లాక్ డౌన్‌ అమలులో ఉండనుంది. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మిజోరాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకున్నారు.

 అస్సాం-మిజోరాం సరిహద్దులో తీవ్ర ఘర్షణలు, విధ్వంసం: కేంద్రం ఎంట్రీ, అసలేం జరిగిందంటే.? అస్సాం-మిజోరాం సరిహద్దులో తీవ్ర ఘర్షణలు, విధ్వంసం: కేంద్రం ఎంట్రీ, అసలేం జరిగిందంటే.?

అంతకుముందు, స్కూళ్లు,కాలేజీలన్నింటినీ మరికొద్దిరోజుల పాటు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 10,12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం అనుమతినిచ్చినప్పటికీ... ఇటీవల 15 మంది విద్యార్థులు వైరస్ బారినపడటంతో స్కూళ్లన్నింటినీ మూసివేయాలని ఆదేశాలిచ్చింది.

Mizoram imposes seven-day lockdown from tomorrow

గడిచిన 24 గంటల్లో మిజోరాంలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పపటివరకూ మొత్తం 2493 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం 290 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మరణాలేవీ సంభవించలేదు. అటు కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉన్నప్పటికీ మిజోరాం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

Recommended Video

Earthquakes In Haryana & Mizoram వరుస భూకంపాలు.. భారత్‌కు క్లిష్ట పరిస్థితి..!!

మరోవైపు గడిచిన 24గంటల్లో భారత్‌లో 45,149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి చేరింది. మరో 480 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,19,014కి చేరింది. ప్రస్తుతం 6,53,717 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో 59,105 మంది డిశ్చార్జి అయ్యారు.

English summary
Mizoram government on Monday said that lockdown to be imposed in the Aizwal Municipal Corporation area from 4:30 am on 26 October till 4:30 am of 3rd November amid spike in novel coronavirus cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X