వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేరే కమ్యూనిటీ వారిని పెళ్లి చేసుకోవద్దు: పాఠశాలల్లో విద్యార్థులో ప్రతిజ్ఞ! ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

ఐజ్వాల్: మిజోరాంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఓ వింత ప్రతిజ్ఞ చేయించారు. అయితే, దానికి ఓ కారణం కూడా ఉంది. మిజో కమ్యూనిటీని తప్ప ఇతరులెవ్వరినీ వివాహం చేసుకోమని సెప్టెంబర్ 2న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో పలు పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయించారు. మిజోరాం ఉన్నత విద్యార్థి సంఘం ది మిజో జిర్లాయి పాల్(ఎంజడ్‌పీ) ఈ ప్రతిజ్ఞను నిర్వహించింది.

మిజో ట్రైబల్, సంస్కతి, గుర్తింపును కాపాడుకోవడం కోసమే తాము ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నామని ఎంజడ్‌పీ వెల్లడించింది. 2015 నుంచే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మిజోరాంకు చెందిన పిల్లలు ఎవరూ కూడా ఇతర కమ్యూనిటీలకు చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తాము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది.

Mizoram school students pledge not to marry people outside their community

2015 నుంచి ప్రతి సెప్టెంబర్‌లో దాదాపు అన్ని పాఠశాలల్లో ఇలాంటి ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని వెల్లడంచంది. తమది చాలా చిన్న కమ్యూనిటీ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించింది. వేరే కమ్యూనిటీ వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ద్వారా తమ ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తాము లోక్‌సభలో ఒకే ఒక ఎంపీని కలిగివున్నామని ఎంజడ్‌పీ సీనియర్ నేత రికీ లాల్బియాక్మావియా తెలిపారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలలను సందర్శించి ఇతర కమ్యూనిటీ వ్యక్తులను వివాహం చేసుకోవద్దని కోరుతున్నామని చెప్పారు.

అయితే, తాము బలవంతంగా ఇది చేయడం లేదని, ఇది వారికి మేము చేసే వినతి మాత్రమేనని ఆయన తెలిపారు. కాగా, మిజో కస్టమరీ లా ప్రకారం.. మిజోకు చెందిన మహిళ వేరే కమ్యూనిటీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ట్రైబల్ రైట్స్ కోల్పోవాల్సి వస్తుంది.

English summary
Students of six different schools in Aizawl, Mizoram, pledged not to marry people outside the Mizo community on September 2. The Mizo Zirlai Pawl (MZP) - Mizoram's apex student body - administered the pledge in different schools on Monday, The Indian Express reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X