వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపుల ఆరోపణలు: కేంద్రమంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టు ప్రియారమణి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

<strong>నన్ను లాగి పెదాలపై ముద్దు! నోట్లో నాలుక..: ఎంజే అక్బర్‌పై సీఎన్ఎన్ జర్నలిస్ట్ షాకింగ్ </strong>నన్ను లాగి పెదాలపై ముద్దు! నోట్లో నాలుక..: ఎంజే అక్బర్‌పై సీఎన్ఎన్ జర్నలిస్ట్ షాకింగ్

కాగా, ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఇప్పటి వరకు 20మంది వరకు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సీఎన్ఎన్ మహిళా జర్నలిస్టు కూడా తనకు 18ఏళ్లున్నప్పుడు తనను అక్బర్ లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు.

MJ Akbar resigns from his post over sexual harassment allegations

తాజాగా, తుషితా పటేల్ అనే మరో మహిళ కూడా అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని, న్యాయ స్థానంలోనే తేల్చుకుంటానని ఎంజే అక్బర్ తెలిపారు.

కాగా, తనపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాను మంత్రిగా కొనసాగకూడదనే తన పదవికి రాజీనామా చేసినట్లు ఎంజే అక్బర్ ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి కేంద్రమంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
MJ Akbar on Wednesday resigned from his post of Minister of State External Affairs MEA, amid reports of sexual harassment allegations against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X