చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

70ఏళ్ల చరిత్ర: డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవం, సస్పెన్షన్ ఎత్తివేతకు అళగిరి డిమాండ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

డీఎంకే పార్టీ అధినేత‌గా ఎంకే స్టాలిన్ బాధ్య‌త‌లు స్వీకరణ

చెన్నై: ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌(ళ)గం(డీఎంకే) పార్టీ అధినేత‌గా ఎంకే స్టాలిన్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగళవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్టాలిన్‌ను ఏకగ్రీవంగా అధినేత‌గా ఎన్నుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 70ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి స్టాలిన్.. మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం.

అదే విధంగా, డీఎంకే పార్టీ కోశాధికారిగా దురై మురుగ‌న్‌ను ఎన్నుకున్నారు. మంగళవారం జ‌రిగిన‌ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ ఎన్నిక‌పై నిర్ణయం తీసుకున్నారు. 14ఏళ్ల వయసు నుంచే స్టాలిన్ పార్టీకి సేవలు అందించారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు ప్రత్యేక స్థానం కల్పించారు క‌రుణానిధి.

70ఏళ్ల చరిత్ర.. 50ఏళ్లలో మూడో అధ్యక్షుడిగా స్టాలిన్

అన్నాదురై, కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తిగా స్టాలిన్‌ నిలిచారు. 1944లో పెరియార్‌ ఈ. వి రామస్వామి ద్రవిడార్‌ కజగం పార్టీని స్థాపించారు. ఇదే పార్టీలో సీఎన్‌ అన్నాదురై కూడా ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత పెరియార్‌, ఆయన అనుచరులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 1949లో అన్నాదురై పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కజగం అనే పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు.

1969లో అన్నాదురై మరణించారు. దీంతో మళ్లీ పార్టీ వారసుడిపై విబేధాలు తలెత్తాయి. సీనియర్‌ నేతలైన కరుణానిధి, వీఆర్‌ నెదున్‌చెజియాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కరుణానిధివైపే పార్టీ నేతలు మొగ్గుచూపారు. దీంతో కరుణానిధి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కరుణానిధి అధ్యక్ష బాధ్యతలు కొనసాగించారు. ఇప్పుడు కరుణ మరణంతో స్టాలిన్ మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

MK Stalin elected DMK chief, party demands Bharat Ratna for Karunanidhi

మాజీ సోవియట్ యూనియన్ నేత అయిన జోసెఫ్ స్టాలిన్ పేరును స్పూర్తిగా తీసుకుని తన కుమారుడికి పెట్టుకున్నారు కరుణానిధి. ఇటీవ‌ల మాజీ సీఎం, డింఎకే చీఫ్ క‌రుణానిధి మ‌ర‌ణించ‌డంతో ఆ పార్టీ ప్రెసిడెంట్ స్థానానికి మంగళవారం ఎన్నిక నిర్వ‌హించారు. కాగా, జనరల్ కౌన్సిల్ సమావేశంలో కరుణానిధికి భారతరత్న ఇవ్వాలని పార్టీ డిమాండ్ చేసింది.

మ‌రోవైపు పార్టీ చీఫ్ పదవి కోసం స్టాలిన్‌పై ఆయన సోదరుడు అళ‌గిరి తిరుగుబాటు ప్రకటించారు. కాగా, డీఎంకే పార్టీని కాపాడాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్న ఆళగిరి.. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

14ఏళ్ల నుంచే పార్టీకోసం పనిచేసిన స్టాలిన్

కరుణానిధికి స్టాలిన్‌ మూడో కుమారుడు. 1953 మార్చి 1న మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టిన నాలుగు రోజుల తర్వాతే రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ మరణించారు. వామపక్ష భావాలపై ఉన్న మమకారంతో కరుణానిధి తన తనయుడికి స్టాలిన్‌ అని పేరు పెట్టారు. స్టాలిన్‌ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 14ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1967 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు.

1973లో డీఎంకే జనరల్‌ కమిటీకి స్టాలిన్‌ ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన జైలుకెళ్లడంతో స్టాలిన్‌ పేరు వార్తల్లో నిలిచింది. తమిళనాడు అసెంబ్లీని స్టాలిన్ నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

కాగా, కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు చేపడుతారా అన్న సందిగ్ధత డీఎంకే శ్రేణుల్లో చాలా కాలం పాటు ఉంది. అయితే ఈ సందిగ్ధతను తొలగిస్తూ స్టాలినే తన రాజకీయ వారసుడంటూ 2013 జనవరిలో కరుణానిధి ప్రకటించారు. ఆ తర్వాత 2017లో స్టాలిన్‌ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కరుణ మరణంతో స్టాలిన్ పార్టీ అధ్యక్షుడయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

English summary
M K Stalin was elected president of the Dravida Munnetra Kazhagam (DMK) on Tuesday at the party's General Council meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X