వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ నన్ను కిడ్నాప్ చేయలేదు: ఏళ్ల తర్వాత చెప్పిన నాటి న్యూస్ రీడర్ ఫాతిమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కొన్నేళ్ల కిందట దూరదర్శన్ తమిళ ఛానళ్లో న్యూస్ రీడర్‌గా పని చేసిన ఫాతిమా బాబును డీఎంకే చీఫ్ స్టాలిన్ కిడ్నాప్ చేసినట్లుగా ప్రచారం ఉంది. దీనిపై ఫాతిమా తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. అప్పుడు ఏం జరిగిందో ఆమె వెల్లడించారు.

స్టాలిన్ తనను అపహరించినట్లుగా వచ్చిన వదంతులతో తాను ఆశ్చర్యపోయానని, ఈ విషయమై ఓ వార పత్రిక విలేకరికి తాను వివరణ ఇచ్చినప్పటికీ ప్రచురితం కాలేదని పేర్కొన్నారు. దూరదర్శన్‌లో తాను న్యూస్ రీడర్‌గా పని చేస్తున్న సమయంలోనే సీరియల్‌లో నటించే అవకాశం వచ్చిందన్నారు.

ఆ నిబంధన వల్లే

ఆ నిబంధన వల్లే

ఆ సీరియల్ పూర్తయ్యేవరకు వార్తలు చదివేందుకు వీల్లేదనే నిబంధనలు ఉండేవని, దీంతో ఆ సీరియల్ చిత్రీకరణ జరిగిన పదమూడు వారాలు తాను దూరదర్శన్‌లో వార్తలు చదవలేదని చెప్పారు. ఆ సమయంలోనే వదంతులు వచ్చాయన్నారు. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, బెదిరించలేదన్నారు. ఓ పార్టీ అగ్రనేత పరువుకు భంగం కలిగించే వదంతులు రావడం దారుణమన్నారు.

కళంకం తెచ్చేలా అవాస్తవాలు సరికాదు

కళంకం తెచ్చేలా అవాస్తవాలు సరికాదు

ఓ పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు కళంకం తెచ్చేలా అవాస్తవాలు చెప్పడం సరికాదని ఫాతిమా బాబు అన్నారు. ఇకపై ఇలాంటి వదంతులకు వివరణ ఇవ్వనని చెప్పారు. సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ ప్రచారం అలాగే ఉండటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

అయినా వదంతులు వచ్చాయి

అయినా వదంతులు వచ్చాయి

పెళ్లికి ముందు, ఆ తర్వాత కూడా తన భర్త బాబు టీవీ ఛానల్ కార్యక్రమానికి స్వయంగా తీసుకు వెళ్లి తీసుకు వచ్చేవారని ఫాతిమా బాబు చెప్పారు. అయినా వదంతులు వచ్చాయన్నారు. ఈ సంఘటన జరిగి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.

 అన్నాడీఎంకే పార్టీలో ఉన్నప్పటికీ

అన్నాడీఎంకే పార్టీలో ఉన్నప్పటికీ

కాగా, ఫాతిమాబాబు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. న్యూస్ రీడర్ నుంచి ఆమె ఆ తర్వాత వెండి తెరపైకి కూడా ప్రవేశించారు.

English summary
MK Stalin, many years ago, had allegedly kidnapped news reader Fathima Babu which is now declined by herself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X