వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కు తగ్గిన గాలి సన్నిహితుడు ఆనంద్ సింగ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు, గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆనంద్ సింగ్ తన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని బీజేపీ అధిష్టానానికి హామి ఇచ్చారు. బీజేపీ సీనియర్ నాయకులు సోమవారం ఆనంద్ సింగ్ కు నచ్చచెప్పి రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సూచించారు.

సోమవారం విధాన సౌధలో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఆనంద్ సింగ్ ఈ సమావేశానికి హాజరైనారు. ఆ సందర్బంలో కేసు విచారణ జరగుతున్న సమయంలో రాజీనామా ఎందుకు చేస్తున్నారని, నేరం చేసినట్లు ఇంకా రుజువుకాలేదు కదా అని బీజేపీ నాయకులు గుర్తు చేశారు.

Anand Singh

ఆనంద్ సింగ్ తో చర్చలు జరిపి రాజీనామాను వెనక్కు తీసుకోవాలని నచ్చచెప్పా రు. తరువాత పార్టీ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటానని ఆనంద్ సింగ్ అన్నారు. ఇదే రోజు స్పీకర్ కాగోడు తిమ్మప్పను కలిసి తన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని ఆనంద్ సింగ్ వారికి హామి ఇచ్చారు.

అక్రమంగా బళేకెరి హార్బర్ నుండి ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని ఆనంద్ సింగ్ మీద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆనంద్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే లోకాయక్త పోలీసులు ఇటివల ఆనంద్ సింగ్ ను అరెస్టు చేశారు.

గత సోమవారం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆనంద్ సింగ్ అక్కడి నుండే రాజీనామా చేస్తూ ఆ లేఖను స్పీకర్ కు పంపించారు. గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆనంద్ సింగ్ జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రి అయిన సమయంలో మంత్రిగా పని చేశారు.

English summary
After meeting with party leaders on Monday, April 20th Vijaynagar (Bellary) MLA Anand Singh decided to withdraw resignation to MLA post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X