అడిగినంత డబ్బు ఇవ్వలేదని బ్యాంకు సిబ్బందిని ఎంఏల్ఏ ఏం చేశాడంటే
రత్ పూర్ :రిజ్వర్ బ్యాంకు గవర్నర్ పై విశ్వేంద్రసింగ్ అనే ఎంఏల్ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు.
ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆ ఎంఏల్ఏ చెబుతున్నారు. అసలు ఎంఏల్ఏకు ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా, ఆయన అడిగినన్నీ డబ్బులు బ్యాంకులు ఇవ్వలేదు.అందుకే ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొంది.
రాజస్థాన్ కు చెందిన విశ్వేంద్రసింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఏల్ఏ. వీరిది రాజుల వంశం పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఆయన కూడ సాధారణ ప్రజల మాదిరిగానే ఓరియంటల్ కామర్స్ బ్యాంకు వద్ద క్యూలో నిలబడ్డాడు నగదు కోసం. రాజు గారి బ్యాంకు నుండి పదివేల రూపాయాలను డ్రా చేసుకోవాలని భావించాడు.
అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం పదివేల రూపాయాలను ఇచ్చేందుకు అంగీకరించలేదు.రాజు గారి వంతు వచ్చేసరికి బ్యాంకులో కేవలం 3 లక్షల నగదు మాత్రమే ఉంది. ఆయన మాత్రం పదివేల రూపాయాలు కావాలని కోరాడు. పదివేల రూపాయాలు ఇచ్చేందుకు మాత్రం ఆయన అంగీకరించలేదు. రెండు వేలు మాత్రమే బ్యాంకు అధికారులు ఇచ్చారు.
పెద్ద నగదు నోట్లను రద్దు చేసే సమయానికి ప్రజలకు అవసరమైన నగదును అందుబాటులో ఉంచకుండా ఎందుకు ఇబ్బందులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం
చేశారు.
ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు, బ్యాంకు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ అంశమై తాను
కోర్టును ఆశ్రయిస్తానని చెప్పాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!