వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్, నెం. 13

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీలో కీలక నేతలు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు.

వరుసగా పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతుంటే.. మమతా బెనర్జీ కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే, పార్టీ నుంచి టికెట్ దక్కదనుకుంటున్నవాళ్లే ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని, ఇంకా ఎవరైనా పార్టీని వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చంటూ ఇటీవల మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం గమనార్హం.

MLA Dipak Haldar joins BJP, latest from TMC to jump ship ahead of Bengal polls

కాగా, మమతా బెనర్జీకి అండదండగా ఉన్న కీలక నేత సువేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరడంతో ఆ పార్టీలోకి వలసలు మొదలయ్యాయ్యి. తాజాగా డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్.. బీజేపీలో చేరారు. దీంతో ఇప్పటి వరకు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరడం గమనార్హం.

తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పిన దీపక్ హల్దార్.. సోమవారం టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, సువేందు అధికారి సమక్షంలో దీపక్ హల్దార్ కాషాయ కండువా కప్పుకున్నారు.

కాగా, అధికార పార్టీ నుంచి మరింత మంది నేతలు తమ పార్టీలో చేరతారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. శనివారంనాడు మాజీ మంత్రి, టీఎంసీ ఎమ్మెల్యే రాజీబ్ బెనర్జీ, ఇతర పార్టీ నేతలతో కలిసి బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

Recommended Video

#UnionBudget2021: ఎన్నికలు జరిగే రాష్టాల్లో హామీలుగా కేంద్ర బడ్జెట్‌.. కొత్త రోడ్డు ప్రాజెక్టులు!

రాజీబ్ బెనర్జీతోపాటు బైశఆలీ దాల్మియా, ప్రబీర్ ఘోషల్, రతిన్ చక్రబర్తి, రుద్రానిల్ ఘోష్ కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీని వీడిన మూడో మంత్రి రాజీబ్ బెనర్జీ. లక్ష్మీరతన్ శుక్లా, సువేంద్ అధికారి లాంటి కీలక నేతలు టీఎంసీని వీడారు. టీఎంసీ నుంచి ఎంపీ సునీల్ మండల్ కూడా బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఎంసీలో మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారంటూ ఇటీవల అమిత్ షా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

English summary
Former TMC MLA Dipak Haldar on Tuesday joined the Bharatiya Janata Party (BJP) in presence of party leaders Mukul Roy and Suvendu Adhikari, giving the saffron party a fillip ahead of the Assembly elections due in April-May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X