India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MLA love story: ఉద్యోగం, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే రేప్ చేశాడు, కేసు పెట్టిన ఆంటీ, కూతురు !

|
Google Oneindia TeluguNews

జైపూర్/ రాజస్థాన్: సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరకు ప్రజలు వారి కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లి వస్తున్నారు. మాకు ఏదైనా సహాయం చెయ్యాలని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఉద్యోగాలు కావాలని, కొందరు కాంట్రాక్టు పనులు కావాలని, కొందరు మా వ్యాపారానికి సహకరించాలని ఇలా రకరకాల పనుల మీద ఆ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కొన్ని సంవత్సరాల నుంచి తన మీద అత్యాచారం చేసి ఇప్పుడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఓ వివాహిత మహిళ ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడం కలకలం రేపింది. గతంలో లవ్ మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ ఆ ఎమ్మెల్యే మీద న్యాయపోరాటానికి దిగడంతో ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కూడా ఆ ఎమ్మెల్యే మీద అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఆఫ్ సెంచురి పూర్తి చేసిన ఆ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశామని స్వయంగా పోలీసు అధికారులు చెప్పారు. తనను ఆ ఎమ్మెల్యే అతని అపార్ట్ మెంట్ లోనే పదేపదే అత్యాచారం చేశాడని, చివరికి ఆ ఎమ్మెల్యే, ఆయన పీఏ, కారు డ్రైవర్ కలిసి తనను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించి వదిలిపెట్టారని ఆమె పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !

సిట్టింగ్ ఎమ్మెల్యే

సిట్టింగ్ ఎమ్మెల్యే


రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలోని గోగుంద నియోజక వర్గం నుంచి ప్రతాప్ లాల్ భిల్ (52) అనే బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. మా కష్టాలు తీరుస్తాడని నమ్మకంతో గత శాసన సభ ఎన్నికల్లో ప్రతాప్ లాల్ భిల్ కు ఓట్లు వేసిన ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ రూటే సపరేటు అని అక్కడి ప్రజలు అంటున్నారు.

 ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు

ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ దగ్గరకు ప్రజలు వారి కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లి వస్తున్నారు. మాకు ఏదైనా సహాయం చెయ్యాలని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఉద్యోగాలు కావాలని, కొందరు కాంట్రాక్టు పనులు కావాలని, కొందరు మా వ్యాపారానికి సహకరించాలని ఇలా రకరకాల పనుల మీద ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.

రేప్ కేసు పెట్టిన వివాహిత మహిళ

రేప్ కేసు పెట్టిన వివాహిత మహిళ

గోగుంద నియోజక వర్గంలోని అంబామాతా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 38 సంవత్సరాల వయసు ఉన్న వివాహిత మహిళ రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద అంబామాతా పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు పెట్గడం కలకలం రేపింది. ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద రంజిత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ అయ్యారు.

ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ?

ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ?

బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి తన మీద అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోమని అడినందుకు ఇప్పుడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వివాహిత మహిళ రంజిత ఎమ్మెల్యే మీద కేసు పెట్టడం కలకలం రేపింది. ఏఎస్పీ అంజనా సుఖ్వాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మీద నమోదు అయిన అత్యాచారం కేసు విచారణ జరుగుతోంది.

10 నెలల క్రితం ఎమ్మెల్యే మీద రేప్ కేసు

10 నెలల క్రితం ఎమ్మెల్యే మీద రేప్ కేసు

10 నెలల క్రితం ఇదే బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద సుఖేర్ లో అత్యాచారం కేసు నమోదు అయ్యింది. ఈ కేసును ఇప్పటికే సీఐడికి అప్పగించారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె మీద అత్యాచారం చేశాడని, తరువాత చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు అంటోంది. సుఖేర్ లోని ఫ్లాట్ లో, నిముచ్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో తన మీద ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

 కిడ్నాప్ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు

కిడ్నాప్ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు

తనను బీజేపీఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ అతని అపార్ట్ మెంట్ లోనే పదేపదే అత్యాచారం చేశాడని రంజిత ఆరోపిస్తున్నది, చివరికి ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్, ఆయన పీఏ, కారు డ్రైవర్ కలిసి ఇదే సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన తనను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి ఇంకోసారి కేసు అని పోలీసు కేసు పెడితే నిన్ను చంపేస్తామని బెదిరించి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించి వదిలిపెట్టారని రంజిత పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసి కేసు పెట్టడం కలకలం రేపింది.

లవ్ మ్యారేజ్...... ఇద్దరు పిల్లల తల్లి

లవ్ మ్యారేజ్...... ఇద్దరు పిల్లల తల్లి


ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద కేసు పెట్టిన మహిళ మంబాయికి చెందినదని రాజస్థాన్ పోలీసులు అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం ముంబాయికి చెందిన రంజిత 21 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుందని, తరువాత ఇద్దరూ ఉదయ్ పూర్ వచ్చి కాపురం పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు.

లేడీకి 19 ఏళ్ల కూతురు ఉంది

లేడీకి 19 ఏళ్ల కూతురు ఉంది

8 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత రంజితన ఆమె భర్త వదిలేశాడని, తరువాత రంజిత ఆమె 19 ఏళ్లు, 10 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు కూతుర్లతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నదని పోలీసు అధికారులు అంటున్నారు. భర్తను వదిలేసిన రంజిత తరువాత ఉద్యోగం కావాలని ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ దగ్గరకు వెళ్లడంతో అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం అయ్యిందని సమాచారం.

ఎమ్మెల్యే మ్యాటర్ సీఎం వరకు వెళ్లింది

ఎమ్మెల్యే మ్యాటర్ సీఎం వరకు వెళ్లింది

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద అత్యాచారం కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం సీఎంతో పాటు గవర్నర్ వరకు వెళ్లిందని రాజస్థాన్ నాయకులు అంటున్నారు. వల్లభానగర్ ఉప ఎన్నికలు పూర్తి అయిన తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఇప్పుడు ఎదురు తిరిగాడని బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ లాల్ భిల్ మీద అత్యాచారం ఆరోపణలు రావడంతో రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయని అక్కడి మీడియా అంటోంది.

English summary
MLA love story: BJP MLA booked-for allegedly raping 38 year old woman in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X