వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజనీర్‌పై బురద బోసిన ఎమ్మెల్యే...16మంది అనుచరుల అరెస్ట్...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రాలో ఇంజనీర్‌పై బురద పోసి, దాడిన చేసిన ఎమ్మెల్యేతోపాటు మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంకావళి అనే ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారింది..దీంతో ఆ రోడ్డును పరీశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే వెళ్లాడు.. ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షక ఇంజనీర్ అయిన ప్రకాశ్ షెడ్కర్ కూడ ఉన్నాడు.. పర్యవేక్షణలో భాగంగా ఎమ్మెల్యే నితేష్ సదరు ఇంజనీర్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

ఈనేపథ్యంలోనే ఆయనను తన అనుచరుల ముందే నెట్టివేసే ప్రయత్నం చేశాడు...ఇక ఓ వైపు ఎమ్మెల్యే ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఇంజనీర్ పై బకెట్లలో నింపిన బురద నీటిని గుమ్మరించారు..ఇలా రెండు బకెట్లతో ఇంజనీర్‌పై పోశారు....ఇక బురద నీరు పోయడమే కాకుండా ఇంజనీర్‌ను తాళ్లతో కట్టివేశారు.

MLA Nitesh Rane was arrested along with his 16 supporters

కాగా ఎమ్మెల్యే చేతిలో అవమానానికి గురైన ఇంజనీర్ అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..ఇక ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కోన్నాడు. రోడ్డు పర్యవేక్షణను ఎల్లప్పుడు చేస్తానని , ఈనేపథ్యంలోనే కర్ర పట్టుకుని అధికారులతో పని చేయించుకోవడం ఎమ్మెల్యేగా తన భాద్యత అంటూ తాను చేసిన చర్యపై స్పందించాడు.

English summary
MLA Nitesh Rane, who is also son of former Chief Minister of Maharashtra Rajya Sabha MP Narayan Rane, was arrested along with his 16 supporters for assaulting and tying a National Highway Authority of India on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X