• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

CM seat: సీఎంను మార్చేయాలని సొంత పార్టీలో లొల్లి, సీక్రెట్ మీటింగ్, పచ్చి నిజం, నో డౌట్ ?, గోవిందా !

|

బెంగళూరు: సీఎం కుర్చిలోని ఆ నాయకుడిని మార్చేయండి మహాప్రభో అంటూ కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో సిట్టింగ్ CMతో పాటు ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. హైకమాండ్ మీద ఒత్తిడి చేసి ఎలాగైనా సీఎంను మార్చేయాలని ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని వెలుగు చూసింది. ప్రభుత్వంలో ప్రభావంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి కూడా సీఎంను మార్చాలని చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలు పచ్చి నిజం అని బాంబు పేల్చడం కలకలం రేపింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ పొరుగా రాష్ట్రంలో సీఎం మార్చు కచ్చితంగా జరుగుతుందని అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ధీమాగా చెప్పడంతో సిట్టింగ్ సీఎంకు అప్పుడే టెన్షన్ మొదలైయ్యిందని సమాచారం.

Fake baba: ఒకే ఫ్యామిలీలో వదినలు, మరదలు, నాలుగు రేప్ కేసులు, ఆంటీ రివర్స్ తో, బాబా!Fake baba: ఒకే ఫ్యామిలీలో వదినలు, మరదలు, నాలుగు రేప్ కేసులు, ఆంటీ రివర్స్ తో, బాబా!

 సీఎం మీద అసంతృప్తి ?

సీఎం మీద అసంతృప్తి ?

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద సొంత పార్టీకి చెందిన కొందరు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఎలాగైనా సీఎంను మార్చేసి మంత్రి పదువులు సంపాధించుకోవాలని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 సీఎంను మార్చేయండి మహాప్రభో

సీఎంను మార్చేయండి మహాప్రభో

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను మార్చాలని సీనియర్ మంత్రి అరవింద్ లింబాలి, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ఆపరేషన్ కమలలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, సీనియర్ మంత్రి సీపీ. యోగేశ్వర్ తో పాటు 8 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఈ సీఎంను మార్చేయండి ప్రహాప్రభో అంటూ ఢిల్లీ పెద్దలను వేడుకొవడానికి బీఎస్. యడియూరప్ప వర్గం ఢిల్లీలోనే మకాం వేసిందని వెలుగు చూసింది.

 సీఎం ఉంటారు..... నో డౌట్

సీఎం ఉంటారు..... నో డౌట్

బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు సీఎంగా యడియూరప్ప కొనసాగుతారని, అందులో ఎలాంటి డౌట్ లేదని సీఎం వర్గీయులు ధీమాగా చెబుతున్నారు. అయితే సీఎం మార్చు కచ్చితంగా ఉంటుందని, యడియూరప్ప ఎవరి పేరు ప్రతిపాదిస్తే ఆయనే సీఎంగా ఉంటారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. సీఎం యడియూరప్ప నాయకత్వంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం కేవలం వారిఊహగానాలు మాత్రమే అని ఆయన వర్గీయులు అంటున్నారు.

 ఢిల్లీలో స్కెచ్ వేస్తున్నారు.... ఇది పచ్చి నిజం

ఢిల్లీలో స్కెచ్ వేస్తున్నారు.... ఇది పచ్చి నిజం

కర్ణాటక ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి, ఓ వర్గానికి నాయుడైన ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ మీడియాతో మాట్లాడుతూ బాంబు పేల్చారు. సీఎంను మార్చాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న మాట పచ్చి నిజం అని, ఆ విషయం తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఎన్నో సమస్యలు.......అదో లొల్లి

ఎన్నో సమస్యలు.......అదో లొల్లి

మంత్రి పదవులు దక్కని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు సీఎం బీఎస్. యడియూరప్ప మీద గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. మరో పక్క సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీవై. విజయేంద్ర ప్రభుత్వంలో, కొందరు మంత్రుల శాఖల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, నాన్న నిజం సీఎం అయితే కొడుకు సూపర్ సీఎం అవతారమెత్తారని ఆరోపణలు ఉన్నాయి.

  4.44 Lakh Covishield Vaccine Doses Reached AP జిల్లాలకు వ్యాక్సిన్ల తరలింపు...!! || Oneindia Telugu
   ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు ?

  ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు ?

  కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప నాయకత్వాన్ని మార్చితే ఆ రాష్ట్రంలో ఎక్కువ కాలం బీజేపీ అధికారంలో ఉండదని, మళ్లీ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వస్తుంది ? అని కొందరు బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కరోనా కాలంలో ప్రజల కష్టాల గురించి ఆలోచించకుండా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం బీఎస్. యడియూరప్ప నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మకాం వెయ్యడం అనేక విమర్శలకు దారితీసింది.

  English summary
  Karnataka leadership change: Eight MLAs have held a secret meeting in Delhi in connection with Yediyurappa's leadership change. Now is the time to manage and control Covid-19 in the state, not the right time to change CM.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X