బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో గోవధను అడ్డుకున్న లేడీ టెక్కీ: 150 మంది దాడి, పోలీసులు ఎస్కేప్, కారు !

గోవధను అడ్డుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద 150 మందికి పైగా దాడి చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

గోవధను అడ్డుకున్న లేడీ టెక్కీ: 150 మంది దాడి | Oneindia Telugu

బెంగళూరు: గోవధను అడ్డుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద 150 మందికి పైగా దాడి చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నందిని అనే లేడీ టెక్కీ మీద దాడి చేసిన స్థానికులు ఆమె కారును ధ్వంసం చేసి నీకు దిక్కున్నచోట చెప్పులో అని సవాలు చేశారు.

తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని టిప్పు సర్కిల్ లోని కసాయిఖానాలో అక్రమంగా గోవధ జరుగుతోందని లేడీ టెక్కీ నందిని గుర్తించారు. ఇద్దరు పోలీసులను వెంట పెట్టుకుని టిప్పు సర్కిల్ లోని కసాయిఖానా దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఓ వర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు.

Mob of 150 assault techie for reporting case of illegal cow slaughter in Bengaluru

గోవధను అడ్డుకోవడానికి వెళ్లిన నందిని మీద స్థానికులు దాడికి దిగారు. ఆ సందర్బంలో భయంతో ఇద్దరు పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. నందిని మీద దాడిచేసిన స్థానికులు ఆమె కారును ధ్వంసం చేశారు. తల, చేతులు, ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో నందిని ఆసుపత్రిలో చేశారు.

చికిత్స పొందిన తరువాత నందిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 150 మంది మీద కేసు నమోదు చేశారు. నందిని మీద దాడి చేసిన నిందితులు మాయం అయ్యారు. నందిని మీద దాడి జరిగిన విషయం తెలుసుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు బీఎస్. యడ్యూరప్ప ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

గోవధను అడ్డుకోవడానికి వెళ్లిన నందిని మీద దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో శాంతి భద్రతలు లోపించడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. లేడీ టెక్కీ నందిని మీద దాడిచేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

English summary
A Bengaluru techie, on Sunday, fell prey to mob brutality as she was assaulted by over 150 people after she reported a case of alleged illegal cow slaughter taking place in Talaghattapura area located on the outskirts of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X