వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు కోసం బ్యాంకు అధికారులను చితక్కొట్టారు,72 గంటల్లో నల్లధనం పై నాలుగు వేల మెయిల్స్

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన ప్రజలు బ్యాంకు అధికారులను చితక్కొట్టారు. బ్యాంకు అధికారులను ప్రజలు కొట్టడాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాథ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అలహాబాద్ : పెద్ద నగదు నోట్ల రద్దు తో కొత్త కరెన్సీ కోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సక్రమంగా బ్యాంకు అధికారులు ఖాతాదారులు సమాధానం చెప్పడంలేదు. రోజుల తరబడి పనులు మానుకొని డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులను చితకబాదారు స్థానికులు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటచేసుకొంది.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఎటిఎం ల వద్ద జనం బారులు తీరుతున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి. అయితే కొందరు బ్యాంకు అధికారుల తీరుతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఖాతాదారులు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులపై ఖాతాదారులు తిరగబడ్డారు.

attack

అలహబాద్ లోని బ్యాంకు ఆఫ్ బరోడా శాఖకు చెందిన అధికారులు, ఖాతాదారులు రోడ్డుపై తిట్టుకొన్నారు. ఇరువర్గాల మద్య మాటా మాటా పెరిగింది. డబ్బులుఇవ్వకుండా పదే పదే తిప్పించుకొంటున్నారని ప్రజలు మండిపడ్డారు. అంతేకాదు రోడ్డుపైనే బ్యాంకు అధికారులను పట్టుకొని కొట్టారు.ఈ దాడులకు ఘటనను కొందరువీడియో తీసి సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

72 గంటల్లో నాలుగు వేల మెయిల్స్

నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతోంది. నల్లధనం వివరాలను తెలియజేసేందుకు వివరాలను ప్రకటించాలని కోరుతూ ఈమెయిల్ ను ప్రకటించిన 72 గంటల్లోనే నాలుగువేల మెయిల్స్ వచ్చాయి. [email protected] పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ మెయిల్ కు విపరీతమైన స్పందన వచ్చింది.

అనుమానాస్పద ఖాతాల.పై ఆదాయపు పన్నుశాఖాధికారలు నిఘా

బ్యాంకు ఖాతాల్లో రోజువారీగా జమ అవుతున్న నగదు వివరాలు ఆదాయపు పన్నుశాఖాధికారులకు చేరుతోంది. పైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్ ద్వారా ప్రతి రోజూ ఆదాయపు పన్నుశాఖకు ఈ వివరాలు చేరుతున్నాయి. దీని ద్వారా విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.అనుమానాస్పద ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

English summary
a mob attacks on bank employees on Monday outside a bank in allahabad and all the fighting was captured in a video.due to some reasons yet to be known, a mob started beating up a couple of employees of bank of baroda right outside the bank branch.the whole mess was shot in a video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X