వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామూహిక హత్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సుప్రీం విచారణ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక హత్యలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. గతం సారి పిటిషన్ విచారణ చేసిన సుప్రీంకోర్టు సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్ని రాష్ట్రాలు తెలియజేయాలంటూ వారం రోజుల సమయం ఇచ్చింది.

<strong>ఆ హత్యలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే</strong>ఆ హత్యలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించాలంటూ సెప్టెంబర్ 13వరకు గడువు ఇచ్చింది. ఆదేశాలను స్పందించని ఆయా రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. సామూహిక హత్యల నివారణకు మంత్రులతో కమిటీ వేశామని ... దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇదివరకే తెలిపింది. అయితే సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి.

Mob lynchings issue: Supreme court to take on state governments report

పెరుగుతున్న సామూహిక హత్యలను సీరియస్‌గా పరిగణించాలని కేంద్రం ఇలాంటి ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు జూలై 17న సూచించింది. కేంద్రంపైనే భారం వేసి రాష్ట్రాలు తప్పించుకోవాలని చూడటం సరికాదని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఇదిలా ఉంటే సామూమిక హత్యలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా కేంద్రం త్వరలో చట్టం తీసుకురానుందని జూలైలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ తెలిపారు.

English summary
The Supreme Court will on Monday resume hearing in case related to recent mob lynching incidents across the country. A top court bench, headed by Chief Justice of India Dipak Misra, will preside over the hearing. Notably, the court had during the last hearing given a time of one week to states that had not complied with its previous order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X